Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ యువనేత లోకేష్ మీద పోసాని కృష్ణమురళి ఫైరింగ్ చూసాక ఆయన కోపం ఎలా ఉంటుందో ఇంకోసారి అందరికీ అర్ధం అయ్యింది. ఆయన కోపం గురించి అందరికీ తెలుసు గానీ పోసాని ఇష్టపడ్డ వాళ్లకు సుడి తక్కువ అని మాత్రం కొద్ది మందికే తెలుసు. అదెలాగో తెలుసుకోవాలంటే కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే.
అది 2004 . తొమ్మిది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న రోజులు. ఎన్నికలు వచ్చాయి. మహామహులు అనుకున్నవాళ్ళే చంద్రబాబుకి అనుకూలంగా మాట్లాడేందుకు భయపడుతున్నప్పుడు పోసాని కృష్ణమురళి ధైర్యంగా ముందుకు వచ్చారు. చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచేలా టీడీపీ కి ఓటేయమని కోరుతూ సొంత ఖర్చుతో పేపర్ ప్రకటన ఇచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కి , చంద్రబాబుకి ఘోర పరాజయం ఎదురైంది.
అది 2009 . ఏపీ లో సరికొత్త రాజకీయ వాతావరణం. వై.ఎస్ , చంద్రబాబు వంటి దిగ్గజ నేతల మధ్యలోకి ప్రజారాజ్యంతో దూసుకొచ్చారు చిరంజీవి. త్రిముఖ పోటీలో ఎవరికి ప్రజా మద్దతు దొరుకుతుందో అర్ధం కాని పరిస్థితి. ఆ ఎన్నికల టైం లో పోసాని ప్రజారాజ్యం లో చేరడమే గాకుండా ఆ పార్టీ తరపున గుంటూరు జిల్లా చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు.ఈ ఓటమికి ముందు ప్రజారాజ్యం ఆఫీస్ లో కూర్చుని పోసాని చేసిన రచ్చ అందరికీ గుర్తుంది.
ఇక 2014 . రాష్ట్ర విభజన జరిగి సమర్ధ నాయకత్వం కావాలని ప్రజలు భావిస్తున్న రోజులు అవి. అవినీతి , అక్రమ సంపాదన కేసులతో జైలుకు వెళ్లొచ్చిన జగన్ నాయకత్వం మీద సీరియస్ గా చర్చ జరుగుతున్న రోజులు కూడా. అప్పుడు పోసాని గారు అవినీతి పరుడు కాని రాజకీయ నేత ఎవరు అని ప్రశ్నించి ఆ ఎన్నికల్లో తన మద్దతు ఎవరికో చెప్పకనే చెప్పాడు. ఆ ఎన్నికల్లో పోసాని మనసు దోచిన ఫ్యాన్ తిరగకుండా ఆగిపోయింది. ఇక ఇప్పుడు 2019 ఎన్నికలు రాబోతున్నాయి. తన ఓటు , ప్రచారం జగన్ కే అని పోసాని కుండ బద్దలు కొడుతున్నారు. పై మూడు ఎన్నికల్లో పోసాని సపోర్ట్ చేసిన పార్టీలకు ఏ గతి పట్టిందో చూసాం. ఆ సెంటి మెంట్ తో వైసీపీ శ్రేణులు పోసానిని చూసి ఉలిక్కిపడుతున్నాయి. ఎవరి భయం వారిది మరి.