Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్కినేని ఫ్యామిలీ నుండి పుష్కర కాలం క్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ సక్సెస్ కోసం పడరాని పాట్లు పడుతూ ఉన్నాడు. ఈ పుష్కర కాలంలో సుమంత్‌కు దక్కిన సక్సెస్‌లను వేళ్ల మీద లెక్కించొచ్చు. ఇక కొన్ని సంవత్సరాలుగా ఆ సక్సెస్‌లు కూడా లేవు. సక్సెస్ కాదు, కనీసం పర్వాలేదు అనేట్లుగా కూడా సక్సెస్‌లు రాలేదు. అయినా కూడా ప్రయత్నం మానకుండా టాలీవుడ్లో తాను ఒక హీరోను అనే పేరును నిలుపుకునేందుకు సంవత్సరానికో లేదా రెండు సంవత్సరాలకో సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ‘మళ్లీ రావా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కేవలం మూడు నెలల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
సుమంత్ అన్ని చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా సోదిలో లేకుండా పోతుందని అంతా భావించి లైట్ తీసుకున్నారు. అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై ఆశలు పెట్టుకోలేదు. కాని ఈ చిత్రం ఒక ఫీల్ గుడ్ మూవీ అంటూ టాక్‌ను దక్కించుకుంది. ముఖ్యంగా ఏ క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చిత్రం ఉంది. బి, సి క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినా కూడా మల్టీప్లెక్స్ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లుగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడు. ఇన్నాళ్లకు సుమంత్‌కు ఒక చెప్పుకోదగ్గ సినిమా పడ్డది అంటూ సినీ వర్గాల వారు సైతం ఒకింత ఆశ్చర్యంను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు వస్తున్న టాక్‌తో మెల్ల మెల్లగా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఈ సక్సెస్‌తో సుమంత్ మరో అయిదు ఏళ్ల పాటు హీరోగా కొనసాగుతాడేమో చూడాలి.