హీరో రామ్ తాజాగా ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దసరా బరిలో నిలిచిన ఆ చిత్రం యావరేజ్ టాక్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆశించిన స్థాయిలో ఆ చిత్రం సక్సెస్ కాలేదని చెప్పుకోవచ్చు. రామ్ గత చిత్రమే కాదు అంతకు ముందు చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేక పోయాయి. కొన్ని డిజాస్టర్స్‌గా నిలిచాయి. దాంతో రామ్ తర్వాత సినిమాపై చాలా ఆలోచిస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఎన్నో కథలు వింటున్న రామ్ తాజాగా పూరి జగన్నాధ్ కథకు ఓకే చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. పూరి జగన్నాధ్ మూవీ కోసం కొత్త మేకోవర్ కూడా సిద్దం అయ్యాడంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే రామ్ ఇంకా ఏ సినిమాకు ఓకే చెప్పలేదు అంటూ ఆయన సన్నిహితులు మరియు సినీ వర్గాల వారు చెబుతున్నారు.
పూరి జగన్నాధ్ కథ రెడీ చేస్తున్న మాట వాస్తవమే కాని ఇంకా పూరి కథకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అంటూ కొందరు చెబుతున్నారు. పూరితో పాటు మారుతి కూడా రామ్ కోసం ఒక కథను సిద్దం చేస్తున్నాడు. ఇద్దరి కథలపై రామ్ శ్రద్ద పెట్టాడు. ఇద్దరిలో ఎవరికి కథ ముందుగా ఫైనల్ అయితే వారితో సినిమా చేయాలని రామ్ భావిస్తున్నాడట. మారుతి మంచి ఫాంలో ఉన్న కారణంగా మారుతితో సినిమా చేస్తే బాగుంటుందని రామ్ అభిమానులు కోరుతున్నారు. పూరి సినిమాలు ఔట్ డేటెడ్ అయ్యాయి. దాంతో ఆయన దర్శకత్వంలో నటిస్తే రామ్‌కు సక్సెస్ వస్తుందనే నమ్మకం లేదని వారి అభిప్రాయం. సక్సెస్ ఇవ్వలేని దర్శకుడిపై నమ్మకం పెట్టుకవడం అంటే గాల్లో దీపం పెట్టడమే అని, అందుకే మారుతితో సినిమా చేస్తే బాగుంటుందని అంటున్నారు. కాని రామ్ మాత్రం ఇంకా ఎటూ త్చేలేదు. ఆయన త్వరగా తేల్చాలని అభిమానులు కోరుతున్నారు.