ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కోపం.. ఇంకా ఎంత కాలం వెయిట్‌ చేయాలంటున్నారు

Prabhas Sahoo Movie Release Date Postponed

ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌ హీరోయిన్‌గా సుజీత్‌ దర్శకత్వంలో వంశీ మరియు ప్రమోద్‌లు నిర్మిస్తున్న ‘సాహో’ చిత్రం అదుగో ఇదుగో అన్నట్లుగా సాగుతూ వస్తోంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్‌ స్టైల్‌లో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంను వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని మొదట చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పారు. ఆ తర్వాత వచ్చే సమ్మర్‌లో సినిమా విడుదల ఉంటుందని చెప్పారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘సాహో’ చిత్రం మరింత ఆలస్యం అవుతుందని సినీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ అనుకున్న స్థాయిలో స్పీడ్‌గా సాగడం లేదని, స్పీడ్‌గా చిత్రీకరణ జరిగే సమయంలో ఏదో ఒక అడ్డంకి రావడం మళ్లీ స్లో డౌన్‌ అవ్వడం జరుగుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

Prabhas Movie Shooting In Italy

‘సాహో’ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా అవ్వడం వల్ల హడావుడి లేకుండా, మెల్లగానే చిత్రీకరణ జరపాలని చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు. అందుకే వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ చిత్రంను 2019 ఆగస్టు 15న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఈ భారీ సినిమాను విడుదల చేసి భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకోవాలని యూవీ నిర్మాతలు భావిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళంలో రికార్డు స్థాయలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్‌ క్రేజ్‌ అమాంతం పెరిగింది. దాంతో సినిమా మంచి బిజినెస్‌ చేస్తుందనే నమ్మకం కూడా ఉంది. 500 కోట్లకు పైగా వసూళ్లు ఈ చిత్రం సాధిస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి కాని అభిమానులు వెయిట్‌ చేయలేక విసుగు చెందుతున్నారు.

sahooo