సాహో క్లారిటీ లేకపోవడంతో గందరగోళం

saaho movie release date not confirmed

బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ ఇండియన్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. అందుకు తగ్గట్టుగానే తన తరువాత సినిమాను సుజిత్ దర్శకత్వంలో అత్యంత భారి బడ్జెట్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మొదలు పెట్టి వన్ ఇయర్ దాటింది. ఈ మద్య ప్రభాస్ బర్త్ డే సందర్బంగా సాహో చిత్రం మేకింగ్ వీడియో ని ఒక్కటి రిలీజ్ చేశారు అంతే తప్ప ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయం పైన క్లారిటీ లేదు. ఒక్క మాటగా 2019 సమ్మర్ లో వస్తుంది అనే టాక్ ఉన్నది. మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ఏప్రిల్ లో వస్తుంది. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ చిత్రమే, మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం ఏప్రిల్ చివరలో విడుదలకు సిద్దంగా ఉన్నది.

సాహో క్లారిటీ లేకపోవడంతో గందరగోళం - Telugu Bullet

ఆ రెండు భారీ బడ్జెట్ చిత్రాల విడుదల తేది పైన ఓ క్లారిటీ ఉన్నది. కానీ సాహో చిత్రం విడుదల తేది పైన మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. సాహో చిత్రానికి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగానే ఉంటాయి కావున సమ్మర్ కి విడుదల చేయకపోవచ్చు , ఇంకా కొంచెం సమయం పట్టవచ్చు. దుబాయ్ షూటింగ్ షెడ్యూల్ తరువాత సాహో చిత్రం కొద్ది గా బ్రేక్ ఇచ్చింది. ఎందుకంటే గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నది. ఈ సినిమా తర్వాత షెడ్యూల్ స్టార్ట్ అయ్యే లోపు ప్రభాస్ మరో సినిమాను దర్శకుడు రాధా కృష్ణ తో ఓ సినిమాను పట్టలేక్కించాడు. ప్రస్తుతం సాహో చిత్రం షూటింగ్ మళ్ళీ జరుపుకుంటుంది. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఆగస్ట్ లో స్వాతంత్ర దినోత్సవం కానుకగా విడుదల చెయ్యబోతున్నారట.