ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పేలుడు…కారణమైన నటి అరెస్ట్…!

power bank blast in delhi airport

ఢిల్లీలోని ఎయిర్ పోర్ట్ లో ఓ మహిళ హంగామా సృష్టించింది. ఎయిర్ పోర్టులోని టెర్మినల్ 1 వద్ద మాళవికా తివారి(56) అనే మహిళ చేసిన పనికి పవర్‌బ్యాంకు పెద్ద శబ్దం చేస్తూ పేలడంతో ఎయిర్ పోర్టులోని ప్రయాణికులు ఎదో ఉగ్రదాడి అనుకుని ఉలిక్కి పడ్డారు. అయితే వెంటనే ఆమెను ఎయిర్పోర్ట్ సెక్యురిటీ అడుపులోకి తీసుకోవడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు. అందుతున్న సమాచారం మేరకు టీవీ నటి మాళవిక ధర్మశాలకు వెళ్లే విమానం కోసం వేచి చూస్తుంది. ఎయిర్ పోర్టు సిబ్బంది ఆమెను చెకింగ్ కోసం పిలిచారు.

delhi airport
తన హ్యాండ్ బ్యాగులో సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం వాడే పవర్ బ్యాంకును పెట్టుకుని ఆమె సెక్యూరిటీ చెకింగ్ కోసం వచ్చింది వారు దానిని బయటకు తీయాలని కోరారు దానికి ఆమె నిరాకరించడంతో కొద్ది సేపు వాదులాట జరిగింది. కోపం పట్టలేని సదరు మహిళ బ్యాగులోని పవర్ బ్యాంక్ తీసి నేలకేసి కొట్టింది. దీంతో చిన్నపాటి పేలుడు సంభవించడంతో కొద్దిసేపు అక్కడి ప్రజలు వణికిపోయారు. అయితే సెక్యూరిటీ ఆమెను అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు, తర్వాత వ్యక్తిగత జామీను మీద సదరు మహిళ ధర్మశాల ఫ్లైట్ ఎక్కింది.

delhi-airport