మాస్ సినిమా కోసం ఎదురు చూస్తున్న డార్లింగ్ అభిమానులు

మాస్ సినిమా కోసం ఎదురు చూస్తున్న డార్లింగ్ అభిమానులు

బాహుబ‌లి సిరీస్ అండ్ ‘సాహో’ చిత్రాలతో నేషనల్ స్టార్ అయిపోయాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ప్రభాస్ కి ముందు నుండి మాస్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. దానికి తోడు తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల ఇండస్ట్రీస్ లో కూడా తనకంటూ మాస్ జనాల్లో ఘనమైన స్టార్ డమ్ ను తెచ్చుకున్నాడు. మొత్తానికి ప్రభాస్ కి నేషనల్ వైజ్ గా మాస్ ఇమేజ్ బాగా బిల్డ్ అయింది. అందుకే ప్రభాస్ నుండి పక్కా మాస్ పాన్ ఇండియా సినిమా రావాలని కోరుకుంటున్నారు
ప్రేక్షకులు.

కాగా ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్న పక్కా మాస్ సినిమా ప్రభాస్ చేస్తాడా.. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా ఫార్ములాతో క్లాస్ ఫీల్ ఉన్న యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. లాస్ట్ సినిమా ‘సాహో’ అత్యున్నత సాంకేతికతో భారీగానే ఉన్నా పక్కా లోకల్ అనే ఫీలింగ్ కలగలేదు మాస్ ప్రేక్షకులకు. ఇక ప్రస్తుతం చేస్తున్నది కూడా అలాంటి క్లాస్ సినిమానే. అందుకే ప్రభాస్ పూర్తి మాస్ ఆడియన్స్ కోసం ఒక యాక్షన్ ఎంటెర్టైనర్ చేస్తే బాగుంటుంది. మరి ప్రభాస్ అభిమానుల కోరికను నెరవేర్చాలని ఆశిద్దాం.