స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీని ఎంచుకున్న సుకుమార్

స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీని ఎంచుకున్న సుకుమార్

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఊర్వశి రౌటెలాను ఫైనల్ చేసిందట చిత్రబృందం.

కాగా ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. అలాగే తమిళ హీరో విజయ్‌ సేతుపతి కూడా ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ గా నటిస్తున్నాడు. మొత్తానికి అన్ని ఇండస్ట్రీస్ నుండి స్టార్ లను తీసుకుని సినిమా రేంజ్ ను పెంచుతున్నారు.

ఇక ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, రంగస్థలం లాగే ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి. అలాగే ‘అల వైకుంఠపురములో’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ ఏరి కోరి సైన్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.