Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. సినిమా ప్రారంభం సమయంలోనే ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిచబోతున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. అయితే సినిమాపై ఉన్న అంచనాలు, పెరుగుతున్న టెక్నాలజీ మరియు ఇతరత్ర కారణాల వల్ల సినిమా బడ్జెట్ అమాంతం రెట్టింపు అయినట్లుగా తెలుస్తోంది. పలువురు బాలీవుడ్ స్టార్స్‌తో పాటు, హాలీవుడ్ టెక్నాలజీ యాక్షన్ సీన్స్‌ను ఈ చిత్రంలో వినియోగిస్తున్న కారణంగా బడ్జెట్ అమాంతం పెరిగి పోతుంది.
సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రం బడ్జెట్ ఏకంగా 300 కోట్లకు చేరే అవకాశం ఉంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఓవర్సీస్‌తో పాటు ఇంకా పలు భాషల్లో కూడా డబ్ చేసే అవకాశం ఉంది. అందుకే ఈ చిత్రం 300 కోట్ల బడ్జెట్ పెట్టినా సునాయాసంగా రికవరీ అవుతుందనే నమ్మకంను నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్‌లు వ్యక్తం చేస్తున్నరు. 500 కోట్ల బిజినెస్ మినిమం అంటూ వస్తున్న వార్తలపై సినీ వర్గాల వారు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరిస్తున్నారు. ఒక్క యాక్షన్ సీన్ షెడ్యూల్‌ను 40 కోట్లకు పైగా ఖర్చు చేసి చిత్రీకరించారు. ప్రభాస్, శ్రద్దా కపూర్‌ల జంటకు ఖచ్చితంగా అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయం అని, చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.