Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రభాస్… అనుష్క మధ్య ఉన్న అనుబంధం ఏమిటి? ఇది మిలియన్ డాలర్ ప్రశ్న. తామిద్దరం మంచి స్నేహితులమని వారు పలుమార్లు చెబుతూ వస్తున్నారు. అయితే ఇద్దరి ప్రవర్తన మాత్రం వారి మధ్య ఏదో అనుబంధం ఉందన్న ప్రచారం నిజమే అన్నట్టుగా ఉంటుంది. బాహుబలి తర్వాత ఇద్దరూ కలిసి నటించనప్పటికీ… ఒకే బ్యానర్ లో నటిస్తున్నారు. ఇద్దరూ ఒకరి పుట్టినరోజులకు మరొకరు ఖరీదైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ప్రభాస్ ను మంచి వ్యక్తి అని అనుష్క ఎప్పుడూ పొగుడుతూ ఉంటుంది. అనుష్క గురించి ప్రభాస్ అంతే. ఆమె సినిమా ట్రైలర్ ను, విశేషాలను ఫేస్ బుక్ లో షేర్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అనుష్క తాజా చిత్రం భాగమతి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ హాజరుకానున్నాడన్న వార్తలొస్తుండడం చూస్తే… అనుష్క, ప్రభాస్ కు ఎంతో ప్రత్యేకమో అర్ధమవుతోంది.
ఈ నెల 26న విడుదల కానున్న భాగమతిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అశోక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పోస్టర్స్ కు, టీజర్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రీ రిలీజ్ వేడుకకు ప్రభాస్ హాజరయితే సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయి. అనుష్కతో స్నేహంతో పాటు హోమ్ బ్యానర్ గా భావించే యూవీ క్రియేషన్స్ భాగమతిని నిర్మించడంతో… ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యేందుకు ప్రభాస్ అంగీకరించినట్టు తెలుస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రాన్ని కూడా యూవీ క్రియేషన్సే నిర్మిస్తుండడం విశేషం.