ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ కోసం ప్రధాన మంత్రి ముద్ర యోజన

భారత దేశంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్ర యోజన ప్రవేశపెట్టింది. గతంలో జీతం లేని ఇంటి పనికి, వేతన పనులకే పరిమితమైన మహిళలు ఇప్పుడు ఈ ముద్ర లోన్స్‌ కారణంగా టైలరింగ్ యూనిట్లు, బ్యూటీ పార్లర్లు, ఫుడ్ స్టాల్స్, అగ్రి-ప్రాసెసింగ్ వెంచర్లు, రిటైల్ దుకాణాలు వంటి సూక్ష్మ సంస్థలను ప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థకు వారి వంతు సహకారం అందిస్తున్నారు. అయితే ఈ మార్పు కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, ఇది చాలా సామాజికమైనది. ఇది ఇంట్లో మహిళల గౌరవం కూడా పెంచుతుంది.