రాజశేఖర్ చాలా మంచోడు.. జ్యోక్యం ఉండదు…!

Prasanth Varma Comments On Rajashekar

రాజశేఖర్ నటించిన గరుడవేగా చిత్రం మంచి విజయంను దక్కించుకుంది. ఈ చిత్రం విజయంతో రాజశేఖర్ మరల తన ట్రాక్ లోకి వచ్చాడు. ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి అనే చిత్రంలో నటిస్తున్నాడు ఈ చిత్రం 1980 నేపద్యంలో రూపొందుతుంది. ఈ చిత్రం సగభాగం ఆ నేపద్యంలోనే ఉంటుంది. ఈ చిత్రంలో నటిస్తున్న రాజశేఖర్ పైన కొన్ని రూమర్స్ వస్తున్నాయి. కల్కి చిత్రంలో రాజశేఖర్ దర్శకత్వ విభాగంలో జోక్యం చేసుకుంటున్నాడని, ప్రశాంత్ వర్మ చెప్పినట్లు చెయ్యడం లేదని ఈ మద్య చాలా పుకార్లు వస్తున్నాయి. వీటికి అన్నింటికీ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఫుల్ స్టాప్ పెట్టదలిచాడు.

ప్రశాంత్ వర్మ కల్కి చిత్రం ప్రెస్ మీటు లో మాట్లాడుతూ… అవ్వని వట్టిపుకార్లు రాజశేఖర్ గారు చాలా మంచి వ్యక్తి నేను చెప్పింది తప్పకుండ వచ్చి చేస్తున్నాడు కెమెరా ముందుకు రాగానే తన పనేంటో తను చేసుకుంటూ పోతాడు తప్ప అయన వేరే పనిలో అసలు జోక్యం చేసుకోడు అన్నాడు. అలాగే అంతటి గ్రేట్ యాక్టర్ తో పనిచెయ్యడం చాలా సంతోషంగా ఉన్నది. నేను ఏదైతే కావాలనుకుంటానో దాని ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాడు. రాజశేఖర్ పైన వస్తున్న వార్తలు వట్టి పుకార్లు మాత్రమే అన్నారు. అయన చాలా ఉన్నతమైన వ్యక్తి అన్నారు. ఇంతటితో రాజశేఖర్ పైన వస్తున్న వార్తలకు ప్రశాంత్ వర్మ ఫుల్ స్టాప్ పెట్టాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.