Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా ఆంధ్రాలో అడుగుపెట్టిన ప్రశాంత్ కి ఇక్కడ ఆశ్చర్యకరమైన పరిణామాలు ఎదురు అయ్యాయట. ఓ వైపు ఆయన ఏ వైసీపీ సభ కి వెళ్లినా జగన్ మీద అపరిమితమైన అభిమానం కనిపిస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే ఓ స్టార్ హీరోకి తగ్గట్టు ఇమేజ్ వుంది. కానీ క్షేత్ర స్థాయిలో నాయకత్వం గురించి అడిగినప్పుడు జగన్ మీదే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయట. ఆయన ఎవరినీ లెక్కచేయబోరని, సీనియర్ నాయకులకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని పార్టీ శ్రేణులు తరచుగా ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారట. తన కంటికి ఓ విషయం కనిపిస్తోంది. కింద నుంచి వస్తున్న సర్వేల్లో ఇంకో మేటర్ వినిపిస్తోంది. దీంతో కన్ఫ్యూజ్ అయిన ప్రశాంత్ కిషోర్ జగన్ మేటర్ ఏంటో తేల్చేయడానికి తనకు తానే ఓ అగ్ని పరీక్ష పెట్టుకున్నాడట. అందులో ఓ కండువా కీలక పాత్ర పోషించబోతోంది. ఆసక్తికరంగా కనిపిస్తున్న ఆ మిస్టరీ మీ కోసం.
కాంగ్రెస్ లో వున్నప్పుడు అయినా, ఆపై వైసీపీ ఏర్పాటు చేసినా జగన్ వస్త్రధారణ, వేష ధారణ ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. లైట్ కలర్ గళ్ళ చొక్కా,ముదురు రంగు ప్యాంటు తో సాదాసీదాగా కనిపిస్తారు. పార్టీ సభలు, సమావేశాల్లోకూడా వైసీపీ కండువా ని ఆయన వేయగానే తీసేస్తారు. ఎందుకిలా అన్న డౌట్ వచ్చిన ప్రశాంత్ కిషోర్ దీని గురించి ఆరా తీసారట. అందరూ ఒక్కటే మాట చెప్పారు. వైసీపీ కండువా కి కూడా జగన్ పెద్దగా విలువ ఇవ్వరని చెప్పారట.దీంతో జగన్ ఇకపై పార్టీ సమావేశాల్లో వైసీపీ కండువాతో కనిపించేలా ఒప్పించాలని ప్రశాంత్ కిషోర్ తనకు తానే ఓ పరీక్ష పెట్టుకున్నారట. జగన్ తో ఈ విషయం గురించి మాట్లాడాక అది అగ్నిపరీక్ష అని తేలిందట. ప్రశాంత్ అడిగినప్పుడు దానిదేముందిలే అన్న జగన్ ఆ తర్వాత కూడా వైసీపీ కండువా వేసుకోడానికి పెద్దగా ఆసక్తి చూపలేదట. దీంతో ఓ సందర్భంలో చంద్రబాబు సహా వివిధ ప్రముఖ నాయకులు తమ పార్టీ కండువాని ధరిస్తున్న విధానం గురించి ఫోటోలు సేకరించి చూపారట. ఆ జాబితా నేడు దేశాన్ని ఏలుతున్న మోడీ ఫోటో కూడా ఉందట . పార్టీ కండువాని అధినేత గౌరవిస్తే మిగిలిన వాళ్ళు కూడా అదే రీతిలో గౌరవిస్తారని జగన్ కి ప్రశాంత్ నచ్చజెప్పారట. అప్పటికి చూద్దాం అని చెప్పిన జగన్ తన వ్యూహకర్త మాట ఇకనైనా వింటాడో లేదో చూడాలి.
ఒకవేళ కండువా విషయంలో జగన్ తన మాట వింటే భవిష్యత్ లో నాయకులకి గౌరవం ఇచ్చే దాంట్లో కూడా ఆయన్ని తేలిగ్గా ఒప్పించవచ్చని ప్రశాంత్ భావిస్తున్నాడు. ఒకవేళ ఈ మేటర్ లో ఫెయిల్ అయితే తనకు తానే ఓటమిని ఒప్పుకుని రాబోయే కాలంలో వ్యూహకర్తగా రాణించడానికి మరిన్ని మెలకువలు కోసం ప్రశాంత్ ప్లాన్ చేసుకుంటాడట.
మరిన్ని వార్తలు