గర్భవతిగా ఉన్న ఓ ఏనుగు తాజాగా కేరళలో నీటిలో నిలబడి మృతి చెందింది. ఈ దృశ్యాన్ని చూస్తుంటే ఎంతటి వారికైనా హృదయం ద్రవీభూతమౌతుంది. అడవి పందుల నుంచి రక్షణ పొందేందుకు ఊరిజనం పైనాపిల్ లో క్రాకర్స్ పెట్టి పొలిమేరల్లోని పొలాల్లో ఉంచారు. అవి తినే ఆహారంగా భావించిన ఏనుగు వాటిని ఒక్కసారిగా కొరకడంతో అది పేలిపోయి ఏనుగు నోరు… నాలుకకు చాలా తీవ్రంగా గాయమైంది. ఇంతటి ఘోరమైన దుర్ఘటన తాజాగా అటవీశాఖ అధికారి సోషల్ మీడియా ద్వారా తెలపడంతో అందరిని కలచివేసింది.
అయితే ఓ అడవి ఏనుగు పాలక్కాడ్ జిల్లాలోని సైలెంట్ వ్యాలీ అడవుల నుంచి ఆహారం కోసం సమీప గ్రామంలోకి ప్రవేశించింది. అయితే ఆ ఏనుగు మందుపదార్థాలను లోపలి ఉంచిన పైనాపిల్ కొరికి తినడంతో తీవ్రంగా గాయమై ఎలాంటివి తినలేక పోయింది. క్రాకర్స్ ఉంచిన పైనాపిల్ తీనడంతోనే ఇంతటి దుర్ఘటన సంభవించిందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. దేశీయంగా తయారు చేసిన క్రాకర్లతో ఉన్న పైనాపిల్స్ సాధారణంగా స్థానికులు తమ పొలాలలో అడవి పందుల నుండి రక్షణ పొందేందుకు ఉపయోగిస్తారు. ఇది కొరికి తినడంతో ఆ ఏనుగుకు గాయమైంది. అలాగే.. అది పేలిన శబ్దంతో తీవ్రంగా రక్తస్రావం కావడమే కాకుండా అది ఎలాంటివి తనలేక విపరీతమైన బాధకు లోనైనట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాకండా దానికి పరీక్షలు చేయగా.. ఆ ఏనుగు గర్భవతిగా తేలిందని అధికారులు వివరించారు.
కాగా తాజాగా అటవీ శాఖ అధికారి మోహన్ కృష్ణ తన ఫేస్ బుక్ ద్వారా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అదేమంటే.. పైనాపిల్ కొరకడంతో ఏనుగు నోరు చాలా గాయపడిందని.. దీన్ని బట్టి అది చాలా శక్తిమంతమైన క్రాకర్స్ ను అందులో అమర్చినట్లు తెలిపారు. ఏనుగు, నోరు చాలా తీవ్రంగా గాయపడిందని.. దాంతో ఎలాంటివి తినలేక ఊరిలో కూడా ఆలకితో అలమటిస్తూ.. తిరిగిందని.. ఆ సమయంలో ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టలేదని.. అది ఎంత మంచి ఏనుగో అంటూ అటవీశాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.