తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తలపతి నటించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లియో సినిమా కథ పరంగా అంతగా ఆకట్టుకోకపోయినా రూ. 600 కోట్లు వసూళ్లను సాధించి పర్వాలేదనిపించింది. ఈ మూవీ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తెరకెక్కించాడు. ఇందులో విజయ్, అర్జున్ మరియు సంజయ్ దత్ లాంటి స్టార్లు నటించి మెప్పించారు. కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ను ఓటిటి లోకి విడుదల చేస్తున్నారు చిత్ర బృందం. నవంబర్ 16వ తేదీ నుండి లియో సినిమా నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. ఈ సినిమాను ఓటిటి లో వీక్షించడానికి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వాస్తవంగా అయితే ముందు ప్రకటించిన ప్రకారం లియో సినిమా నవంబర్ 21వ తేదీ నుండి ప్రసారం కావాల్సి ఉన్నది .
కానీ ఒక అయిదు రోజులు ముందుగానే ఈ సినిమా’ ని ఓటిటిలోకి తీసుకు వస్తున్నారు మేకర్స్. మరి లియో థియేటర్ లో పర్వాలేదనిపించగా, ఓటిటి లో అయిన రికార్డులు తిరగరాస్తుందా అనేది చూడాలి.