Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పరువు పోయింది. క్రాస్ ఓటింగ్ కూడా జరుగుతుందని ధీమాగా చెప్పినా.. అసలు పడాల్సిన ఓట్లు కూడా పడలేదని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో 21 ఓట్లు రావాల్సి ఉండగా.. ఇరవై ఓట్లే పడటంపై అధిష్ఠానం సీరియస్ గా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ కూడా మీరాకుమార్ కు వ్యతిరేకంగా జరిగింది.
ఇన్ని అవాంతరాలున్నా.. ఓడిపోయిన వారిలో మీరాకుమార్ ఎక్కువ ఓట్లు సాధించడం ఒక్కటే హస్తం పార్టీకి దక్కిన ఊరట. ఏంటో ఇంత కష్టపడి కనీసం ఈ రికార్డైనా మిగలకపోతే ఎలాగని కాంగ్రెస్ నేతలు తెగా బాథపడిపోయేవారు. కానీ ఇంకాస్త్ ప్లాన్డ్ గా వ్యవహరించి ఉంటే.. బీజేపీని టెన్షన్ పెట్టేవారమని కాంగ్రెస్ సీనియర్లు ఇప్పుడు తీరిగ్గా విచారిస్తున్నారు.
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమీ రాదు. రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే ముందు చేసిన రాజకీయం… ఓట్ల కోసం మాత్రం చేయలేదు. ఇతర పార్టీలు మద్దతిచ్చినా,,, ఇవ్వకపోయినా మద్దతు అడగడం సంప్రదాయం. కానీ మీరాకుమార్ ఆ పని చేయలేదు. కోవింద్ కు అవసరం లేదు కాబట్టి ఇతరుల్ని పట్టించుకోలేదు. ఏది ఏమైనా రాష్ట్రపతి ఎన్నికలు కాంగ్రెస్ కు గుణపాఠం నేర్పాయి.
మరిన్ని వార్తలు