Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ రజినీకాంత్, రంజిత్ పాల కాంబినేషన్లో వచ్చిన ‘కబాలి’ ఫ్లాప్ అయ్యింది. అయినా కూడా దర్శకుడు రంజిత్ పా పై ఉన్న నమ్మకంతో మరో సినిమాను చేసేందుకు అవకాశం ఇచ్చాడు. ధనుష్ నిర్మాణంలో రంజిత్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కాలా’. ఈ సినిమా ఇప్పటికే పూర్తి అయ్యి, విడుదల కావాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యం అవుతూ వస్తుంది. ఎట్టకేలకు విడుదలకు ఉన్న అవాంతరాలు అన్ని సమసి పోయాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన బ్యాలన్స్ వర్క్‌ను పూర్తి చేసి విడుదల చేస్తామని నిర్మాత ధనుష్ చెప్పుకొచ్చాడు.
రజినీకాంత్‌తో ‘కాలా’ చిత్రాన్ని తన కథతో తెరకెక్కిస్తున్నారు అంటూ చలన చిత్ర మండలి మరియు కోర్టులను రచయిత కరికాలన్ రాజశేఖర్ ఆశ్రయించడం జరిగింది. తాను సినిమా చేసేందుకు కాస్త ఆలస్యం అవ్వడంతో ఆ కథను మరియు టైటిల్‌ను చోరీ చేసి రంజిత్ పా ‘కాలా’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు అంటూ రాజశేఖర్ ఆరోపిస్తున్నాడు. తాజాగా వివాదానికి ఫుల్స్టాప్ పడ్డట్లయ్యింది. రాజశేఖర్ ఆరోపిస్తున్నట్లుగా అసలు కథ చోరీ జరగలేదని, ఆయన డలి టైటిల్ రిజిస్ట్రర్ చేయించి సంవత్సరం గడిచింది, దాన్ని రీ షెడ్యూల్ చేయక పోవడం వల్ల ధనుష్‌కు ఇచ్చినట్లుగా తమిళ చిత్ర నిర్మాతల మంముందే తీర్పు ఇచ్చింది. తాజాగా అదే విషయాన్ని కోర్టు దృవీకరించింది. దాంతో కాలా సినిమాకు అడ్డు తొలగినట్లయ్యింది.