Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులు వివాదాస్పదం అవుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే మెగా హీరోలు ఏపీ ప్రభుత్వ పెద్దల నుండి నటన నేర్చుకోవాలంటూ బన్నీ వాసు కామెంట్స్ చేయగా, నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ అవి నంది అవార్డులు కాదు సైకిల్ అవార్డులు అంటూ కౌంటర్ వేశాడు. ఏపీ ప్రభుత్వంకు సన్నిహితంగా ఉండే వారికి మాత్రమే అవార్డులు దక్కడం పట్ల కొందరిలో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. తాజాగా ఆ జాబితాలో నిర్మాత నల్లమల్లపు బుజ్జి కూడా చేరాడు.
తాజాగా ఈయన నంది అవార్డులపై మరింత ఘాటుగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈయన నంది అవార్డులకు కులం రంగు పులమడంతో వివాదం మరింత పెద్దది అయ్యింది. ఇవి నంది అవార్డులు కావని, కమ్మ అవార్డులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను నిర్మించిన ‘రేసుగుర్రం’ చిత్రం అన్ని విభాగాల్లో కూడా అవార్డు దక్కించుకునేందుకు అర్హం అయిన సినిమా. కాని ఒక్క విభాగంలో కూడా నంది అవార్డు రాకపోవడం చూస్తే ఇది ఖచ్చితంగా కమ్మ అవార్డులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రేసు గుర్రం చిత్రం 100 కోట్లు కలెక్ట్ చేస్తే కనీసం సినిమాను నంది జ్యూరీ అవార్డు పట్టించుకోలేదు అంటూ బుజ్జి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈయన మాట్లాడుతూ సి కళ్యాణ్‌పై కూడా తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. నంది అవార్డులు మొత్తం కమ్మ కులం వారు లాబీయింగ్ చేసుకుని ఇచ్చుకున్నారు అంటూ బుజ్జి ఆరోపించాడు. నల్లమల్లపు బుజ్జి ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి