పెద్ద వివాదంలో గరుడవేగ

psv garuda vega movie digital rights in trouble
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాజశేఖర్‌, పూజా కుమార్‌ జంటగా ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గరుడవేగ’. భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా లాభాల దిశగా దూసుకు పోతుంది. సినిమా సక్సెస్‌ అయిన నేపథ్యంలో రీమేక్‌ రైట్స్‌, డబ్బింగ్‌ రైట్స్‌, ఆన్‌ లైన్‌ రైట్స్‌, డిజిటల్‌ రైట్స్‌ ఇలా అన్ని రైట్స్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉంది. తాజాగా ఈ చిత్రం డిజిటల్‌ రైట్స్‌ను జీవిత మొదట ఒక సంస్థకు అమ్మేయడం జరిగింది. అయితే తాజాగా మరో సంస్థ భారీ మొత్తంను ఆఫర్‌ చేయడంతో వీరికి రైట్స్‌ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. ఒక్క సినిమా రైట్స్‌ను ఇద్దరికి అమ్మడంతో వివాదం మొదలైంది. దానికి తోడు సినిమాకు మొదట నిర్మాతగా ఉన్న కోటేశ్వర్‌ కూడా ఈ చిత్రం డిజిటల్‌ రైట్స్‌ తన వద్ద ఉన్నాయి అంటూ అమ్మేందుకు సిద్దం అయ్యాడు.

garudavega-movie

కోటేశ్వర్‌ ఇటీవల ఒక సంస్థ నుండి అడ్వాన్స్‌ కూడా తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ఒక్క సినిమా రైట్స్‌ను ముగ్గురు కొనుగోలు చేయడంతో వివాదం మొదలైంది. ఈ ముగ్గురు మాత్రమే కాకుండా సినిమాకు ఫైనాన్స్‌ చేసిన ఒక వ్యక్తి కూడా ఈ రైట్స్‌లో తనకు షేర్‌ ఉందని ముందుకు వచ్చాడు. దాంతో గరుడవేగ రైట్స్‌ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. కోటేశ్వర్‌ సినిమా నిర్మాణం నుండి తప్పుకున్నాడని, ఆయనకు సినిమాతో సంబంధం లేదని నిర్మాత జీవిత అంటోంది. కాని కోటేశ్వర్‌ మాత్రం పూర్తిగా సెటిల్‌ చేసుకోలేదని, రైట్స్‌ తన వద్ద ఉన్నాయని చెబుతున్నాడు. మొత్తానికి ఈ వివాదం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీ అయ్యింది. ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుంది అనేది చూడాలి.