Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యాంగ్రీ యంగ్మన్ రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ‘గరుడవేగ’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రాజశేఖర్‌కు సుదీర్ఘ కాలం తర్వాత సక్సెస్ దక్కింది. ఏమాత్రం అంచనాలు లేకుండా భారీ బడ్జెట్‌తో రూపొందిన గరుడవేగ చిత్రంపై సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అనుమానాలు వ్యక్తం చేశారు. సినిమా పెట్టిన పెట్టుబడిలో కనీసం సగం అయినా వసూళ్లు చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కాస్త దాదాపు 30 కోట్ల వరకు నిర్మాతకు తెచ్చి పెట్టినట్లుగా తెలుస్తోంది. అన్ని ఏరియాల్లో కూడా మంచి కలెక్షన్స్‌ను సాధించిన ఈ చిత్రం తాజాగా శాటిలైట్ రైట్స్ రూపంలో కూడా లాభాలను దక్కించుకుంది.
రాజశేఖర్ సినిమా అంటే ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు ఉండవు. కానుక ‘గరుడవేగ’ చిత్రం విడుదలకు ముందు శాటిలైట్ రైట్స్‌ను 1.30 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒక ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ముందుకు వచ్చింది. అయితే జీవిత మాత్రం రెండు కోట్లకు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. రాజశేఖర్ సినిమా రెండు కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే లాభం ఉండదని భావించిన సదరు ఛానెల్ నిర్వాహకులు వెనక్కు తగ్గారట. సినిమా విడుదల తర్వాత అదే శాటిలైట్ రైట్స్ ఏకంగా నాలుగు కోట్లకు అమ్ముడు పోయింది. జీవిత అయిదు కోట్లకు ఈ శాటిలైట్ రైట్స్‌ను అమ్మాలని భావించినా కూడా జెమినిటీవీ నాలుగు కోట్ల వరకు పెట్టేందుకు ముందుకు వచ్చింది. చివరకు జెమిని టీవీకి నాలుగు కోట్లకు శాటిలైట్ రైట్స్‌ను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత రాజశేఖర్ నటించిన సినిమాకు లాభాలు వస్తుండటంతో ఆయన సన్నిహితులు మరియు ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.