Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Puri Directing A Film With NTR To Compromise Jai Lava Kusha Script Issue
ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న ‘జై లవకుశ’ చిత్రంలోని జై పాత్రను పూరి జగన్నాధ్ ఐడియా నుండి కాపీ చేశారని, ఎన్టీఆర్‌కు ఒకానొక సమయంలో పూరి ఆ పాత్ర గురించి చెప్పాడని, ఎన్టీఆర్ ఆ ఐడియాను దొంగిలించి ఈ చిత్రంలో పెట్టించాడనే వాదన వినిపించింది. ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికలో కూడా అదే వార్త ప్రముఖంగా వచ్చింది. దాంతో చిత్ర యూనిట్ సభ్యులు నష్ట నివారణ చర్యు చేపట్టారు. దర్శకుడు పూరి జగన్నాధ్‌తో ఎన్టీఆర్ అండ్ టీం మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఇద్దరి మద్య రాజీ కుదిరినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
ఇక రాజీ కోసం ఎన్టీఆర్ తన 50 రోజుల డేట్లను పూరికి ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. 2019లో పూరి దర్శకత్వంలో నటించేందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడట. దానికి తోడు 10 లక్షల రూపాయలను సైతం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక సినిమాలో పూరి జగన్నాధ్‌కు కృతజ్ఞతలు అని కూడా వేయబోతున్నారట. మొత్తానికి పూరి ఐడియాను కాపీ చేసినందుకు గాను ఎన్టీఆర్ అండ్ టీం భారీగానే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ రాజీతో పూరి సంతృప్తి చెందాడని, సదరు మీడియాలో వచ్చిన వార్తను కొట్టి పారేస్తున్నాడని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్‌పై మాత్రం విమర్శలు అలాగే వస్తున్నాయి. ఐడియాలను దొంగిలించి రాజీ కుదుర్చుకోవడం నేరమే అంటున్నారు.
మరిన్ని వార్తలు