Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డ్రగ్స్ కేసులో సిట్ ముందు విచారణకు హాజరైన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇదే సబ్జెక్టు తో ఓ సినిమా చేయబోతున్నట్టు టాలీవుడ్ కోడై కూస్తోంది. అప్పుడెప్పుడో మహేష్ హీరోగా చేస్తానని ప్రకటించిన “జనగణమన ” టైటిల్ తో చేసే ఈ సినిమాకి ‘ లవ్ ఇండియా …హేట్ ఇండియన్స్ ‘ అనేది ట్యాగ్ లైన్ అంట. ఇందులో హీరో ఎవరన్నది ఇంకా తెలికపోయినా ఈ సబ్జెక్టు ని త్వరలో పట్టాలు ఎక్కించడానికి పూరి రెడీ అయిపోతున్నాడట. జనగణమన లో డ్రగ్స్ తో పాటు దేశాన్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యల్ని ప్రస్తావించనున్నట్టు పూరి ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. దేశం మీద ఎంతో ప్రేమతో ఈ సినిమా స్క్రిప్ట్ తయారు చేసినట్టు పూరి వెల్లడించాడు.
జనగణమన గురించి పూరి ఎంత గొప్పగా చెప్పినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వడం కష్టమే అనుకోవచ్చు. ఓ సూపర్ హిట్ కొడితే సీన్ ఏమైనా మారుతుందేమో. బాలయ్య హీరోగా పూరి చేస్తున్న పైసా వసూల్ మీద పెద్దగా అంచనాలు లేవు. అది ఓ రకంగా పూరి కి లక్ అనుకోవాలి. అంచనాలు లేని సినిమాలు భారీ విజయాలు దక్కించుకోవడం ఇటు బాలయ్య, అటు పూరి కెరీర్ లో చాలా సార్లు జరిగింది. ఇప్పుడు పైసా వసూల్ తో అదే సీన్ రిపీట్ అయితే పూరి ఎన్నో ఆశలు పెట్టుకున్న జనగణమన సినిమాకి వీలైనంత త్వరగా గ్రీన్ సిగ్నల్ వస్తుంది.
మరిన్ని వార్తలు