Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు తేజం, ఒలంపిక్ పతక విజేత పి.వి.సింధుకు అరుదైన గౌరవం దక్కింది. కామన్ వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత జట్టుకు సింధు ప్రాతినిధ్యం వహించనుంది. వచ్చే నెల 4 నుంచి ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో కామన్ వెల్త్ క్రీడలు జరగనున్నాయి. గోల్డ్ కోస్ట్ లోని కరార స్టేడియంలో జరగనున్న ఆరంభ వేడుకల్లో సింధు త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని భారత జట్టుకు నాయకత్వం వహించనుంది.
కామన్ వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత జట్టులో స్టార్ బాక్సర్ మేరీకోమ్, మరో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, సైనా నెహ్వాల్ లాంటి సీనియర్లు ఉన్నప్పటికీ..ఈ మధ్య కాలంలో అద్భుతంగా రాణిస్తుండడంతో సింధును పతకధారిగా ఎంపికచేసినట్టు భారత ఒలంపిక్ సంఘం అధికారి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 70దేశాలు కామన్ వెల్త్ క్రీడల్లో పాల్గొంటాయి. ఆరంభ వేడుకల్లో ఈ సారి భారత క్రీడాకారిణిలు గతంలో మాదిరిగా చీరలు కాకుండా కోటు, ట్రౌజర్ ధరించనున్నారు.