‘రా రా’… తెలుగు బులెట్ రివ్యూ

Raa Raa movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :      శ్రీకాంత్‌, నజియా, పోసాని మురళీకృష్ణ , శకలక శంకర్, గెటప్ శ్రీను 
నిర్మాత :          ఎం. విజయ్‌
దర్శకత్వం :       శంకర్ 
మ్యూజిక్ :       రాప్‌ రాక్‌ షకీల్‌

హీరో గా, విలన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఇలా ఎన్నో వైవిధ్యమైన కథలతో, అటు మాస్, ఇటు క్లాస్, మరియు ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పించిన హీరో శ్రీకాంత్. ఈ సారి శ్రీకాంత్ ఫస్ట్ టైం హర్రర్ మూవీ లో నటిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక సతమతమవుతున్న శ్రీకాంత్, ఎలాగైనా ఈసారి ఈ మూవీ ద్వారా మంచి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. హర్రర్ కామెడీ అవ్వటం వలన ప్రేక్షకులు కూడా ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను ఈ ‘రా రా’ చిత్రం అందుకుంటుందో లేదో తెలియాలి అంటే ఒకసారి రివ్యూ లోకి వెళ్ళాల్సిందే…

కథ :

గిరిబాబు దర్శకుడిగా ఇండస్ట్రీ లో బాగా పేరున్న వ్యక్తి. అతని తీసిన 100 సినిమాల్లో 99 చిత్రాలు సూపర్ హిట్స్, ఒకటి ప్లాప్ అవ్వటంతో గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కుతాడు. రాజ్ కిరణ్ (శ్రీకాంత్) గిరిబాబు కొడుకు అవ్వటం వలన అతని దగ్గరకు నిర్మాతలు వెంటబడతారు. కానీ రాజ్ కిరణ్ తీసిన ఒక్క సినిమా కూడా హిట్ కాకపోవడంతో, కొడుకు కోసం గిరిబాబు సినిమా నిర్మిస్తాడు, ఆ సినిమా కూడా ప్లాప్ అవ్వడంతో పాటు, నష్టాలు రావటం వలన గిరిబాబు హార్ట్ ఎటాక్ తో మరణిస్తాడు, దాంతో అతని భార్యకు కూడా హార్ట్ ఎటాక్ రావటంతో ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. అప్పుడు డాక్టర్ మీ అమ్మకు ఇష్టమైన పని చేస్తే ఆమె బ్రతుకుతుంది అని చెప్పటంతో, తల్లి కోసం ఒక సినిమా తీసి దానిని హిట్ చెయ్యాలి అనే ప్రయత్నంలో ఒక బంగాళా కి వెళతాడు. అక్కడకు వెళ్ళిన తర్వాత తను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి?, ఆ పాడుపడిన ఇంటిలో దెయ్యాలు ఎందుకు ఉన్నాయి .? దెయ్యాలతో రాజ్ కిరణ్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? చివరికి సినిమాను ఎలా కంప్లీట్ చేసాడు.? ఇలాంటివి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ 

హీరో శ్రీకాంత్ ఒక్క హిట్ కోసం తహతహలాడుతున్నాడు.ఇలాంటి టైం లో రా .. రా .. సినిమా తో ఎలాగైనా సరే హిట్ కొట్టాలని హారర్ కామెడీ జోనర్ ని సెలక్ట్ చేసుకున్నాడు .ఒక దయ్యం .. దాని చూసి భయపడటం..అలా భయపడుతూ కూడా అర్ధం పర్దం లేని కామెడీ చేయడం ఇలాంటి సినిమా లు చూసి చూసి సగటు ప్రేక్షకుడి కూడా విసుగు వచ్చేసింది.హీరో శ్రీకాంత్ కూడా అదే మూస ధోరణి లో వెళ్ళాడు.శ్రీకాంత్ యాక్టింగ్ ని బయటకి చూపించే కథ కానీ కథనం కానీ ఈ సినిమా లో లేదు . ఎందుకొస్తుందో తెలియని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , టైమింగ్ లేని కామెడీ,అవసరం లేని అరుపులు ఇలా ఒకదానికొకటి సినిమా చూడాలా వద్ద అన్న రేంజ్ కి తీసుకెళ్ళాయి. ముఖ్యంగా హీరోయిన్స్ సీతా నారాయ‌ణ‌, న‌జియాలు సినిమా లో స్కోప్ లేదు.అటు నటన లోను ఇటు గ్లామర్ లోను ఏ మాత్రం ఆక‌ట్టుకోలేదు.

సినిమా లో ఉన్న అందరు మంచి నటులే. పోసాని కృష్ణ మురళి , హేమ , రఘుబాబు , ఆలి , ష‌క‌ల‌క శంక‌ర్ , అదుర్స్ రఘు ఇలా అందరు వున్నా స్క్రీన్ ప్లే లో ఉన్న లోపల వాళ్ళ వారి కామెడీ ఎక్కడ సరిగా అనిపించదు.ఈ సినిమా లో దయ్యం తో చేసే కామెడీ కాని , వాటి తో శ్రీకాంత్ చేసే డాన్స్ లు అంత బాగోలేదు .మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్ రాక్ ష‌కీల్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమా కి ప్లస్ కాలేదు.ఏ సినిమా లో అయిన సినిమాటోగ్ర‌ఫీ చాలా కీలకం అలాంటి దానిని కూడా సరిగా తీయలేకపోయారు. గ్రాఫిక్స్‌, డిఐ కూడా ఈ సినిమా ని ఆదుకోలేకపోయాయి.ఈ సినిమా కి దర్శకుడు ఎవరు అనేది ఇంత వరకు తెలియదు . సినిమా మొదట్లో శంకర్ అనే కొత్త డైరెక్టర్ అనుకున్నారు కానీ తనకి యూనిట్ కి గొడవ అవ్వడం తో తను తప్పుకున్నాడు .ఆ తర్వాత పేరు తెలియని సీనియర్ డైరెక్టర్ ద్వారా సినిమా ని పూర్తి చేసారు.

ప్లస్ పాయింట్స్ :

హీరో శ్రీకాంత్
కొన్ని కామెడీ సీన్స్

మైనస్ పాయింట్స్ :

కథ, కథనం
సినిమాటోగ్ర‌ఫీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
గ్రాఫిక్స్‌ 

తెలుగు బులెట్ రేటింగ్… 2 / 5 .