Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు మరియు తమిళంలో పలు చిత్రాల్లో నటించి బాలీవుడ్‌లో ప్రస్తుతం సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ రాధిక ఆప్టే. ఈమె తన ట్యాలెంట్‌తో, అందాతో హాలీవుడ్‌లో కూడా అవకాశాలు దక్కించుకుంది. హాలీవుడ్‌లో ఈ అమ్మడు చేసిన సినిమాలు మంచి టాక్‌ను దక్కించుకున్నాయి. ఇక బాలీవుడ్‌లో ఈమె బోల్డ్‌గా నటించి భారీ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించింది. ఈమె సౌత్‌లో గతంలో నటించినప్పటికి ఇప్పుడు మాత్రం నటించేందుకు ఆసక్తి చూపడం లేదు. కారణం అడిగితే మాత్రం సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. సౌత్ హీరోలు ఎప్పుడు కూడా బెడ్ రూంకు హీరోయిన్స్‌ను పిలిపించుకునేందుకు ప్రయత్నిస్తారంది.
గతంలో పలు సార్లు సౌత్ హీరోను విన్స్ అంటూ దూషించిన రాధిక ఆప్టే తాజాగా మరోసారి ఒక ఇంటర్వ్యూలో సౌత్ హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. సౌత్ హీరోలు ఏం చేసైనా హీరోయిన్స్‌ను పడకగదికి రప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు. అది సాధ్యం కాకుంటే టార్చర్ చేస్తారు అంటూ రాధిక ఆప్టే చెప్పుకొచ్చింది. నన్ను పలువురు హీరోలు పడకగదికి రప్పించుకునేందుకు ప్రయయత్నించారని, కాని తాను మాత్రం అందుకు ఒప్పుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది.
పడకగదికి వెళ్లాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో తాను సౌత్ సినిమాలకు దూరంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఈమె చెప్పిన సౌత్ సినిమాలు తెలుగు అయ్యి ఉంటుందా లేదా తమిళ హీరోలు అయ్యి ఉంటుందా అనేది మాత్రం తెలియదు. ఈమె తెలుగు మరియు తమిళంలో నటించింది. అయితే తెలుగులో కాస్త ఎక్కువగా నటించింది. కనుక తెలుగు హీరోలు ఈమెను గోకేందుకు ప్రయత్నించారేమో.