దర్శకేంద్రుడిలో కూడా ఇంకా జ్యూస్‌ ఉందట…

Raghavendra Rao to direct Movie with Young Stars

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలుగు సినిమా చరిత్రలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో అద్బుత చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రాఘవేంద్ర రావు శత చిత్రాలను పూర్తి చేసుకున్న విషయం తెల్సిందే. అయితే ఇటీవల ఆయన తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సరిగా ఆడలేక పోయాయి. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా దర్శకేంద్రుడు సినిమాలు తీయలేక పోతున్నాడు అంటూ ఒక విమర్శ వ్యక్తం అవుతుంది. ఇటీవలే ఓం నమో వెంకటేశాయ చిత్రాన్ని చేసిన దర్శకుడు తన తదుపరి సినిమాకు రంగం సిద్దం చేస్తున్నాడు. ఈసారి కమర్షియల్‌ సక్సెస్‌ కొట్టాలనే గట్టి పట్టుదలతో దర్శకుడు ప్రయత్నాలు ప్రారంభించాడు.

కొత్త వారితో ఒక మంచి ప్రేమకథను ఈతరం మరియు పాత తరం వారికి నచ్చే విధంగా రాఘవేంద్ర రావు తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న సినిమాను వచ్చే సంవత్సరం ప్రారంభంలో సెట్స్‌పైకి తీసుకు వెళ్లబోతున్నారు. చాలా తక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని రాఘవేంద్ర రావు భావిస్తున్నారు. అంతా కొత్త వారితో రాఘవేంద్ర రావు చేయబోతున్న ప్రయత్నంపై సినీ వర్గాల వారు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. రాఘవేంద్ర రావు తనలో ఇంకా సత్తా ఉందని నిరూపించుకునేందుకు ఈ చిత్రాన్ని చేయబోతున్నాడు.