అమిత్ షా జీ… క్యా డైలాగ్ హై…!

Rahul-Gandhi-Will-Need-Tele

ఏదో అనుకుంటాం కానీ, భాజపాని ముందుండి నడిపించే అమిత్ షా లో హాస్య చతురత కూడా చాలా ఎక్కువే అన్నట్లుంది. ఆయన చేసే ప్రసంగాలలో, వేసే ఛలోక్తులు కొన్నిసార్లు భలే అనిపిస్తాయి. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే ఈసారి ఎలాగైనా తెలంగాణాలో తమ నాడీ వినిపించడానికి అమిత్ షా కంకణం కట్టుకున్నారని అనిపిస్తుంది అయన తెలంగాణాలో చేసే ప్రచారాలని పరిశీలిస్తుంటే. నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రచార సభలో ఆయన ఈసారి తన విల్లుని పూర్తిగా కాంగ్రెస్ పైకి ఎక్కుపెట్టారు. ఆయన చేసిన ప్రసంగంలో ఒక మాట ఎంతలా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యిందంటే, ఆ మాటకి మీమ్స్ కట్టేటంత. ఆ మాటేమిటంటే “2019 ఎన్నికల తరువాత, కాంగ్రెస్ ఆచూకీ తెలుసుకోవాలంటే, రాహుల్ గాంధీ టెలిస్కోప్ లో చూడాల్సిందే”.

amith-shsh

ఇది విన్నాక మీరు కూడా అమిత్ షా చమత్కారం కి ముచ్చటపడి ఉంటారని అనుకుంటున్నాం. కానీ, తెలంగాణ లో కాంగ్రెస్ బలం రోజురోజుకి పుంజుకుంటుందనే విషయం అమిత్ షా గమనించి, గమనించనట్లుగా ఉన్నారా అనే సందేహం కలుగుతుంది. తెలంగాణాలో ఇదివరటికి పోలిస్తే, ప్రజా కూటమి ఏర్పడ్డాక కాంగ్రెస్ బలం చాలా వరకు పుంజుకున్నదని, తెరాస శ్రేణులు కూడా ఈ విషయంలో ఆందోళన పడుతున్నారనేది కాదనలేని సత్యం. రోజు రోజుకి తెరాస ప్రాబల్యం తగ్గుతుందని ఆ పార్టీకి చెందిన నాయకులు చేస్తున్న ప్రచారాలకు ప్రజల నుండి ఎదురవుతున్న వ్యతిరేకతే సాక్ష్యం.

amith-kcr

మన ప్రియతమా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారే తెరాస గెలుపు పై ధీమాగా ఉన్నట్లు కనిపిస్తున్నా, ప్రగతి భవన్ లో విజయం తథ్యం కోసం ప్రణాళికలు రచిస్తూనే ఉన్నారు. ఇన్ని తెలిసిన అమిత్ షా గారు సంధించిన ఛలోక్తి కాసేపు నవ్వుకోవడానికి ఉపయోగపడొచ్చేమో కానీ, తెలంగాణాలో కాంగ్రెస్ కి విజయంపై ఆశ కలిగేంచేలా వీస్తున్న ఋతుపవనాలని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన విషయమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. చూద్దాం, తెలంగాణాలో బీజేపీ గెలుపుకై రాజకీయ ఉద్ధండుడు గా పేరుగాంచిన అమిత్ షా ఎటువంటి ప్రణాళికలు రాస్తారో.

amith-shah-bjp-party