Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి’ వంటి భారీ చిత్రం తర్వాత జక్కన్న చేయబోతున్న సినిమాకు రంగం సిద్దం అయ్యింది. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్‌ల కలయికలో మల్టీస్టారర్‌గా జక్కన్న చిత్రం తెరకెక్కబోతుంది. వీరిద్దరి కాంబో అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. జక్కన్న ఏమాత్రం తగ్గకుండా, ప్రేక్షకుల ఊహకు సైతం అందకుండా సినిమాను తెరకెక్కించేందుకు స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. జక్కన్న ఏ సినిమా చేసినా కూడా సుదీర్ఘ స్క్రిప్ట్ వర్క్ చేస్తాడు. అలాగే ఈ సినిమాకు కూడా దాదాపు అయిదు నెలల పాటు స్క్రిప్ట్ వర్క్ జరుగనుంది. మరో వైపు ఈ సినిమా కోసం హీరోయిన్స్ ఎంపిక పనిలో కూడా జక్కన్న నిమగ్నమై ఉన్నాడు.
రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు సరిజోడీ హీరోయిన్స్ కోసం బాలీవుడ్ నుండి శాండిల్‌వుడ్ వరకు అన్ని సినిమా పరిశ్రమలో ముద్దుగుమ్మలను పరిశీలిస్తున్నాడు. తాజాగా ఒక హీరోయిన్‌ను ఎంపిక చేయడం జరిగింది. ‘మహానటి’ చిత్రంతో తనను మెస్మరైజ్ చేసిన కీర్తి సురేష్‌ను తన మల్టీస్టారర్‌లో ఒక హీరోయిన్‌గా ఈయన ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ అయితే తాను అనుకున్న పాత్రకు బాగుంటుందని జక్కన్న భావించాడట. అందుకే ఆమెను అనుకోవడం, ఆమె కథ కూడా వినకుండా ఓకే చెప్పడం జరిగిపోయింది. అయితే ఈమె ఎవరి సరసన నటించనుంది అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.