Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడం దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. అతి త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని రజినీకాంత్ ప్రకటించబోతున్నట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం తమిళనాట రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ ముక్కలు చెక్కలు అయ్యింది. ఇక డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి పార్టీని నడపలేక స్టాలిన్‌కు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ రెండు పార్టీలు కూడా బలహీన పడిన నేపథ్యంలో రాజకీయాల్లోకి రజినీకాంత్ ఎంట్రీ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చాడు.
దాదాపు పది పదిహేను సంవత్సరాలుగా రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎట్టకేలకు వారి కోరిక తీరబోతుంది. ఎన్నికలకు ఇంకా దాదాపుగా మూడు సంవత్సరాల సమయం ఉంది. ఈ లోపు పార్టీని పెట్టి, ప్రజలను ఆకర్షించి వచ్చే ఎన్నికల్లో గెలిచి సీఎం పీఠం ఎక్కాలనేది రజినీకాంత్ అభిమతంగా తెలుస్తోంది. అయితే ఎన్నికలు రాకుండానే రజినీకాంత్ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచరం ప్రకారం రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక రాజకీయ నేపథ్యంతో సినిమా తెరకెక్కబోతుంది. అందుకు సంబంధించిన కథ కూడా ఫైనల్ అయ్యింది. ప్రస్తుతం ‘2.0’ చిత్రాన్ని చేస్తున్న వీరు ఆ తర్వాత రాజకీయ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమాలో రజినీకాంత్ సీఎంగా కనిపించబోతున్నాడు. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న రజినీకాంత్ సినిమా ద్వారా తాను ఏం చేయాలని భావిస్తున్నాడో అది చెప్పే అవకాశం ఉంది.
మరిన్ని వార్తలు: