Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Rajini Kanth Robo 2.0 Releasing On Shankranthri
సూపర్ స్టార్ రజినీకాంత్ ‘రోబో’ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా రికార్డు స్థాయిలో ‘రోబో’ చిత్రం వసూళ్లను సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘2.0’ చిత్రంపై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.
భారీ స్థాయిలో అంచనాలున్న ‘2.0’ చిత్రం దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో నిర్మాణం జరుగుతుంది. కనీ విని ఎరుగని రీతిలో హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా శంకర్ ఆ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇక ‘2.0’ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు అప్పుడే మొదలు పెట్టారు.
ఈ సమయంలోనే సినిమాను వచ్చే సంవత్సరం జనవరిలో విడుదల చేయబోతున్నట్లుగా అనధికారికంగా తమిళ సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఈ సంవత్సరంలోనే విడుదల చేయాలని ముందుగా భావించినప్పటికి భారీ సినిమా అవ్వడంతో కాస్త షూటింగ్ ఆలస్యం అయ్యింది. అలాగే నిర్మాణానంత కార్యక్రమాలు కూడా టైం తీసుకుంటుంది.
అందుకే జనవరిలో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న రెండు సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. అందులో మొదటిది సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంగస్థలం’ కాగా, రెండవది కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘భరత్ అను నేను’. ఈ రెండు సినిమాలు ఇప్పటికే సంక్రాంతికి అంటూ ప్రకటించేశారు. సంక్రాంతి బరిలో ‘2.0’ చిత్రం ఉంటే ఈ రెండు సినిమాలు ఆడటం కష్టం అని, ఆ సినిమా సంక్రాంతికే ఫైనల్ అయితే ఖచ్చితంగా రామ్‌చరణ్, మహేష్‌బాబులు వెనక్కు తగ్గే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
మరిన్ని వార్తలు