Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ గురించి సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. రెండు వారాల్లోగా పార్టీ ప్రకటన ఉండొచ్చని విశ్వసనీయ సమాచారం. అంతకన్నా ముఖ్యంగా రజని పెట్టబోయే కొత్త పార్టీ పేరు గురించి ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. రజని పార్టీకి మక్కల్ సేన అని పేరు పెట్టొచ్చని తెలుస్తోంది. మక్కల్ సేన అంటే ప్రజా సైన్యం అని అర్ధం. పవన్ పార్టీ జనసేన అన్నా, రజని ప్రజా సైన్యం అన్నా ఒకటే అర్ధం. ఇక జెండా విషయంలో కూడా పవన్ దారిలోనే వెళుతున్నారట రజని. వ్యవసాయ రంగం, పారిశ్రామిక ప్రగతి, విద్యా రంగం కి ప్రాధాన్యమిస్తూ రజని కొత్త పార్టీ కి చెందిన జెండా రూపొందుతోంది.
ఇక రాజకీయ భావ సారూప్యత విషయంలో కూడా పవన్, రజని ఒకే బాటలో నడుస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రెండు పార్టీలతో ఉమ్మడి వేదిక ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా కొందరు రాజకీయ మేధావులకు వచ్చిందట. జనసేన, మక్కల్ సేన తో పాటు ఒకే ఆలోచనతో వుండే మరికొన్ని పార్టీలని కలిపి ఓ ఫ్రంట్ గా ఏర్పడితే రాజకీయ ప్రాధాన్యం ఉంటుందన్న ఆలోచన కూడా మొగ్గ తొడిగిందట. తెలంగాణ కి చెందిన ఓ విప్లవ పోరాట యోధుడు ఈ విషయాన్ని ఇప్పటికే పవన్, రజని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలో ఓ రహస్య సమావేశం జరగబోతున్నట్టు సమాచారం. ఈ ప్రయత్నం సక్సెస్ అయితే దక్షిణాదిన ఓ సరికొత్త రాజకీయ వేదిక ఏర్పడుతుంది. దేశ రాజకీయాల్లో పెను మార్పులకి పునాది రాయి పడుతుంది.
మరిన్ని వార్తలు: