Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విలక్షణ నటుడు కమల్ హాసన్ బుధవారం తన ‘మక్కళ్ నీది మయ్యమ్’ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కమల్ తమిళ్ పత్రిక ఆనంద వికటన్ కు రాసిన ఒక వ్యాసంలో తాను రాజకీయాలలోకి రాబోతున్న విషయాన్నీ చెప్పడానికి రజనీని సిక్రెట్గా కలిసిన విషయాన్నీ, తమిళ రాజకీయాల గురించి ఇద్దరం రాజకీయాలలోకి రాబోతున్నాం కనుక బురద జల్లే రాజకీయాలు చేయకూడదు అని ఇద్దరు మాట్లాడుకున్నట్లు రాశారు. దీనిపై నిన్న సూపర్ స్టార్ రజినీ కాంత్ స్పందించారు. తమ సిక్రెట్ సమావేశం గురించి, కమల్ పార్టీ సమావేశం గురించి మీడియా తో మాట్లాడారు.
కమల్ తన పార్టీ ప్రకటన కార్యక్రమానికి తనని కూడా ఆహ్వానించారనీ కానీ, కొన్ని కారణాల వల్ల తను కమల్ పార్టీ సమావేశానికి హాజరుకాలేదని వివరించారు. ‘కమల్ సమావేశాన్ని నేనూ చూశాను. చాలా బాగుంది. మా ఇద్దరి ఆలోచనలు, విధానాలు వేరు కావచ్చు. కానీ, లక్ష్యం మాత్రం ఒక్కటే. అదే తమిళనాడు ప్రజలకు మంచి చేయాలనుకోవడం. మొదట కమల్ తన రాజకీయ ప్రవేశం గురించి చెప్పగానే నేను చాలా ఆశ్చర్య పోయాను. నా మిత్రుడు కమల్ మంచివాడు సమర్ధుడు, తమిళనాడు ప్రజల నమ్మకాన్ని కమల్ పొందగలడని కమల్ పై పొగడ్తలు కురిపించారు రజిని.
ఇది ఇలా ఉంటె కమల్ పాలిటిక్స్ లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి ముచ్చటగా మూడు రోజులు కూడా కాకుండానే కమల్ కి షాక్ తగిలింది. కమల్ కి సన్నిహితుడు అయిన మ్యూజిక్ డైరక్టర్ ఘిబ్రన్ పై ఐటి దాడులు జరిగాయాని చెన్నైలో వార్తలు వస్తున్నాయి. విలన్, విశ్వరూపం, చీకటి రాజ్యం వంటి కమల్ రీసెంట్ సినిమాలకు ఘిబ్రన్ సంగీత దర్శకత్వం వహించారు. కేవలం కమల్ సినిమాలకు మాత్రమే కాదు రన్ రాజా రన్, జిల్, బాబు బంగారం, హైపర్ వంటి తెలుగు సినిమాలకి కూడా ఘిబ్రన్ సంగీతం అందించారు. కమల్ కొత్త పార్టీ కి తన వంతు సహకారం అందిస్తూ కమల్ పార్టీకి కావలసిన పాటలను సమకూర్చడం తో పాపం ఈ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఐటి షాక్ తగిలింది అని తమిళ సినిజనాలు చెవులు కొరుక్కుంటున్నారు