Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ ఎంపీ చిరంజీవితో సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. వాటితో పాటు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 58 రాజ్యసభ స్థానాలకు మార్చి 23న ఎన్నికజరగునుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ నుంచి 10 స్థానాలకు, బీహార్, మహారాష్ట్ర నుంచి ఆరు, పశ్చిమ బంగ, మధ్యప్రదేశ్ నుంచి ఐదు స్థానాలకు ఎన్నికలు జరగున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ నుంచి చిరంజీవి, రేణుకాచౌదరి, సీఎం రమేశ్ , తెలంగాణ నుంచి దేవేందర్ గౌడ్, రాపోలు ఆనంద్ భాస్కర్, పాల్వాయి గోవర్థన్ రెడ్డి ల పదవీకాలం ముగియనుంది. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సహా ఎనిమిది మంది కేంద్రమంత్రులు రిటైర్ కాబోతున్నారు. అలాగే ప్రముఖ క్రికెటర్ సచిన్, నటీమణులు రేఖ, జయాబచ్చన్ కూడా రిటైర్ అవుతున్నారు.
అత్యధికంగా బీజేపీ నుంచి 17 మంది, కాంగ్రెస్ నుంచి 14మంది, ఎస్పీ నుంచి ఆరుగురి పదవీకాలం ముగుస్తోంది. మార్చి 5న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్ల సమర్పణకు చివరితేదీ మార్చి 12. తర్వాతి రోజు మార్చి 13న నామినేషన్ల పరిశీలన జరుగుతంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 15ను గడువుగా నిర్ణయించారు. మార్చి 23వ తేదీన ఉదయం 9గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలవరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్లలెక్కింపు జరుగుతుంది.