Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చిరంజీవి కుటుంబానికి, పవన్ కళ్యాణ్ కు మధ్య విభేదాలు ఉన్నాయని కొన్నేళ్లగా ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టే చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అనేకమంది హీరోలకు సంబంధించిన ఏ సినిమా కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ పెద్దగా హాజరుకావటం లేదు. దీంతో చిరంజీవి, రామ్ చరణ్ తేజ, పవన్ కళ్యాణ్ మధ్య రాకపోకలు సంగతి అటుంచి మాటామంతీ కూడా లేవని చాన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే చిరంజీవిని, పవన్ ను కలపాలని చాలా మంది ఎన్నో రోజులుగా ట్రై చేస్తున్నారు. వాళ్ల ప్రయత్నాలు ఇప్పడు సక్సెస్ అయినట్టు కనిపిస్తోంది.
ఇవాళ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ తేజ బాబాయికి ఫేస్ బుక్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. విషెస్ తో పాటు చిరంజీవి, పవన్ కలిసి దిగిన ఫొటోను, తాను, చిరంజీవి కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. ఈ రెండు ఫొటోల్లో బాబాయి అబ్బాయి ఒకే ఫోజులో ఉన్నారు. మొదటి ఫొటోలో పవన్ భుజాల మీద చేతులేసి చిరంజీవి నవ్వుతూ చూస్తున్నారు. రెండో ఫొటోలో బాబాయి ప్లేస్ లో అబ్బాయి రామ్ చరణ్ తేజ ఉన్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఫొటోలతో పాటు బాబాయిని పొగుడుతూ అబ్బాయి కొన్ని కామెంట్స్చేశారు.
పవన్ బాబాయి కావటం తన అదృష్టం అని చెప్పడం కూడా తక్కువే అవుతుందన్నారు చరణ్. పవన్ అబ్బాయిగా తను చాలా సంతోషంగా ఉన్నానని, అదృష్టం, ఆశీర్వాదం పొందిన భావనతో ఉన్నానని తెలిపారు. బాబాయి నుంచి తాను సింపుల్ గా, నిజాయితీగా ఉండటం , మనసులో ఉన్న భావనలనే మాట్లాడటం నేర్చుకున్నానని అబ్బాయి చెప్పుకొచ్చారు. లక్షలమందిలో పవన్కళ్యాణ్ ఒక వినయపూర్వక వ్యక్తని నిజంగా నమ్ముతున్నానని, పవర్ స్టార్ పవర్ సింప్లిసిటీ, హ్యుమానిటీలో ఉందని రామ్చరణ్ తేజ పోస్ట్ చేశారు. ఈ కామెంట్లతో పాటు హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్ పవన్కళ్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్ ను జతచేశారు. రామ్ చరణ్ ఇలా ఫేస్ బుక్ వేదికగా బాబాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పటంతో ఇక మెగా కుటుంబంలో విభేదాలు సమసిపోయినట్టేనని అభిమానులు సంబరపడుతున్నారు.
మరిన్ని వార్తలు: