Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నరం లేని నాలుక ఎటు అయినా తిరుగుతుంది. ఏమైనా మాట్లాడుతుంది. ఈ విషయంలో మాములు జనం కన్నా మహా మేధావి , సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకో నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్టు భలే చెప్పేస్తుంటాడు. ” లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమా ఏర్పాట్లలో వున్న రామ్ గోపాల్ వర్మ ఆ ఫిలిం ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డి సొంతూరు చిత్తూర్ జిల్లా పలమనేరుకి వచ్చారు. రాకేష్ రెడ్డి పలమనేరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తల్లో ఒకరు. ఆయనే “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంలో ఎంత ఖర్చు అయినా సినిమా ని బాగా తీస్తామని నిర్మాత రాకేష్ రెడ్డి చెప్పారు. ఎవరికీ భయపడబోమని అన్నారు. రాజకీయాల కోసం గాక ముంబై లో రాము చెప్పిన కథ నచ్చి మాత్రమే ఈ సినిమా చేస్తున్నట్టు రాకేష్ చెప్పడం చూసి ప్రెస్ మీట్ లోనే అందరూ నవ్వుకున్నారు. సినిమాల్లో ఏ అనుభవం ఉందని రాము ఆయనకి కథ చెప్పి మరీ నిర్మాతగా చేయడానికి ఒప్పించారని ప్రశ్నిస్తూ నవ్వుకుంటున్నారు.
రామూ ఆధ్వర్యంలో, సారధ్యంలో రాకేష్ రెడ్డి ఇన్ని మాటలు చెబుతుంటే ఇక వర్మ గురించి వేరే చెప్పాలా ? “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంట్రీ దగ్గర నుంచి మొదలుకుని ఆయన మరణం దాకా చూపిస్తున్నట్టు చెప్పారు. ఇక వైస్రాయ్ ఎపిసోడ్ కి కూడా ఇందులో భాగం వుంటుందట. ఇదంతా ఒక ఎత్తు అయితే ఓ పెద్ద కామెడీ ఏమిటంటే ఓ వైసీపీ నేత ఇంట్లో కూర్చుని చెబుతూ ఈ సినిమాని రాజకీయాలకు అతీతంగా తీస్తామని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఆయన ఈ మాట అనగానే అబ్బ చా రాము ఏమి చెప్పవయ్యా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.