Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. ఆయన చేస్తున్న సినిమాలతోనే కాకుండా, ఆయన చేసే వ్యాఖ్యలు, పెట్టే పోస్ట్‌లతో ఎప్పుడు మీడియాలో ఉంటూ ఉంటాడు. ఎన్టీఆర్ త్వరలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే చిత్రాన్ని చేయబోతున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ జీవితంలో ఒక ఘట్టంను తీసుకుని ఈ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఆ చిత్రంలో తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకంగా సీన్స్ ఉంటాయని అందరికి తెలుసు. అందుకే కొందరు తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు వర్మ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అనే వ్యక్తి వర్మ సినిమాకు కౌంటర్‌గా లక్ష్మీ పార్వతి మొదటి భర్త గురించి, ఆమె అసలు రంగు బయట పెట్టేందుకు అంటూ లక్ష్మీస్ వీరగ్రంధం అనే చిత్రాన్ని మొదు పెట్టాడు. కేతిరెడ్డి ఆ సినిమాను ఎప్పుడైతే మొదలు పెట్టాడో వర్మ అప్పటి నుండి ఆయన్ను టార్గెట్ చేస్తూ కొన్ని వ్యంగ పోస్ట్‌లు చేస్తున్నాడు. ఎన్టీఆర్‌గా కేతిరెడ్డి నటిస్తే బాగుంటుందని ఒక సారి, లక్ష్మీ పార్వతి పాత్రకు తీసుకున్న అమ్మాయి చాలా బాగుందని మరోసారి కామెంట్స్ చేశాడు. ఇక ఎన్టీఆర్ మాట్లాడుతున్నట్లుగా ఒక వాయిస్‌ను రెడీ చేసి కేతిరెడ్డి సినిమాపై కామెంట్స్ చేయడం జరిగింది. తాజాగా లక్ష్మీ పార్వతి సినిమాను అడ్డుకోవడం గురించి వర్మ ఒక వీడియోను విడుదల చేశాడు. ఎన్టీఆర్ వాయిస్‌తో.. మైడియర్ జగదీశ్వర్‌రెడ్డి గారు, మీరు తీయబోతున్న సినిమా కథ నాకు చాలా బాగా నచ్చింది. శ్రీమతి లక్ష్మీ పార్వతి గారికి నేను చెబుతాను, ఆమె మహాసాద్వి. గొప్ప ఇల్లాలు. ఆమె మీ సినిమాకు ఎలాంటి అవరోదంను కలిగించరు.మీరు ముందుకు వెళ్లండి, చరిత్ర తిరగరాయండి అంటూ చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వర్మ పదే పదే ఆ సినిమా గురించి కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.