వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏది చేసిన సంచలనమే అవుతుంది. వేరే దర్శకులు రెండు మూడు ఫ్లాపులు చవి చూడగానే ఇక తమ పని అయిపోయిందనే ఫిక్సవుతారు కానీ వర్మ మాత్రం అలా కాదు. తన ట్రాక్ రికార్డు ఎంత దారుణంగా ఉన్నా కూడా వరుస సినిమాలను మొండి ధైర్యంతో చేస్తూనే ఉంటాడు. వర్మ తాజా చిత్రం ‘భైరవ గీత’ చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 12న విడుదల చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించారు. అందుకు తగ్గ పోస్టర్‌లను కూడా విడుదల చేశారు. కానీ ఇప్పటికి విడుదల హడావుడి ఏమి కనపడం లేదు.
అక్టోబర్ 11న యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ విడుదల కాబోతుంది. ఎన్టీఆర్‌కు పోటీగా కొత్త నటీనటులతో తెరకెక్కించిన ‘భైరవ గీత’ చిత్రాన్ని విడుదల చేయాలనుకుని వర్మ భావించాడు. దాంతో అంతా షాకయ్యారు. ఎన్టీఆర్‌తో వర్మ పోటీకి దిగుతున్న నేపథ్యంలో ఈయన ధైర్యాన్ని అంతా మెచ్చుకున్నారు. కానీ తాజా పరిణామాలను చూస్తుంటే ఎన్టీఆర్‌తో పోటీకి వెళ్లడం ఎందుకని వర్మ వెనుకడుగు వేశాడు అని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. వర్మ ‘భైరవ గీత’ను అక్టోబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నాడు. తొలుత రెండు భాషల్లో అనుకున్న ‘భైరవ గీత’ను ఇప్పుడు నాుగు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాంతో ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ‘రక్త చరిత్ర’ స్థాయిలో ఉన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో ఒకేసారి విడుదల చేయాలని వర్మ ప్లాన్ చేస్తున్నాడు.