Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్ గోపాల్ వర్మ ఏమి చేసినా సంచలనమే. ఈ మధ్య కాస్త స్పీడ్ తగ్గించాడు అనుకుంటే అదేమీ లేదని జనవరి 1 సందర్భంగా నిరూపించాడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకునే వాళ్ళు అందరూ నిజంగా ఎదుటి వాళ్ళ శ్రేయస్సు కోరితే వారికి ఉత్తుత్తి విషెస్ కాకుండా విలువైన వస్తువులో, డబ్బులో ఇవ్వాలని మెలిక పెట్టాడు. సరే వర్మ సంగతి తెలిసిందే అనుకునేంతలో ఇంకో మ్యాటర్ లో వేలెట్టాడు. తనలోని జర్నలిస్ట్ ని బయటపెట్టాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ వ్యవహారాన్ని వర్మ టచ్ చేసాడు. నిజంగానే ఈ భేటీ చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఒకప్పుడు వాళ్ళు ఇద్దరూ బద్ధ శత్రువుల్లా ఒకరినొకరు ఎలా కామెంట్స్ చేసుకున్నారో గుర్తుకు తెచ్చుకున్నారు. వివిధ పత్రికల్లో, ఛానెళ్ళులో , వెబ్ సైట్స్ లో పని చేసే జర్నలిస్టులు ఆ పాత కామెంట్స్ కోసం వెదుకులాట మొదలెట్టారు. వారి పనిని సులభతరం చేస్తూ తానే ఓ జర్నలిస్టుగా మారిన వర్మ ఒక్కప్పుడు కెసిఆర్ , పవన్ మధ్య అదిరిపోయే రేంజ్ లో పేలిన మాటల తూటాల్ని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. మొత్తానికి తనలో ఓ జర్నలిస్ట్ వున్నాడని రుజువు చేసుకున్నాడు.