Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దర్శకుడు పూరి జగన్నాథ్ తాజాగా ‘హగ్’ అనే ఒక షార్ట్ ఫిల్మ్‌ను తెరకెక్కించాడు. ఇటీవలే ఆ షార్ట్ ఫిల్మ్ ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశాడు. ఒక అమ్మాయి చెట్టును హత్తుకుని ఉన్నట్లుగా ఆ ఫస్ట్‌లుక్‌లో చూపించడం జరిగింది. ఆ ఫస్ట్‌లుక్ సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చర్చనీయాంశం అయ్యింది. పకృతి నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని ఫస్ట్‌లుక్ చూస్తుంటే అనిపిస్తుంది. డిసెంబర్ 31న షార్ట్ ఫిల్మ్‌ను విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు పూరి ప్రకటించాడు. ఇక తాజాగా పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి అయిన హగ్ చిత్రాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చూడటం జరిగింది. పూరిపై వర్మ ప్రశంసలు కురిపించాడు.
వర్మ తన ఫేస్‌బుక్‌లో ‘హగ్’ ఫస్ట్‌లుక్‌ను పోస్ట్ చేసి సినిమా గురించి మాట్లాడుతూ.. ఇప్పుడే పూరి హగ్ పూర్తి సినిమాను చూశాను. అద్బుతమైన కళాకండంగా సినిమా అనిపించింది. భిన్నమైన కథ, కథనం, భావోద్వేగాలతో సినిమాను దర్శకుడు పూరి తెరకెక్కించడం జరిగింది. సినిమా ఉత్తేజం, ఉల్లాసంను కలిగించే విధంగా ఉందని వర్మ పోస్ట్ చేశాడు. తప్పకుండా ఇది ఒక మంచి ప్రయత్నం అంటూ దర్శకుడు పూరిని వర్మ అభినందించాడు. దాంతో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
షార్ట్ ఫిల్మ్‌లకు ఇటీవల మంచి క్రేజ్ ఉంది. వర్మ అందుకే ఈ షార్ట్ ఫిల్మ్‌తో దర్శకుడిగా తనలోని కొత్త యాంగిల్‌ను చూపించాలని భావిస్తున్నాడు. ప్రయోగాత్మక చిత్రాలు చేయాలని భావించిన వారు వెండి తెరపై కంటే ఇలా బుల్లి తెరను ఆశ్రయించాలని భావిస్తున్నారు. ‘హగ్’ చిత్రం యూట్యూబ్‌లో చూసేందుకు మరి కొన్ని గంటలు ఎదురు చూడాల్సిందే. డిసెంబర్ 31 ఉదయం 10 గంటలకు యూట్యూబ్ ద్వారా ‘హగ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.