హీరోయిన్ ఊర్మిళ‌ను ఎత్తేసిన వ‌ర్మ‌…

RGV praises Urmila after watching Bewafa Beauty Video Song

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

1990ల్లో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన ఊర్మిళ గురించి సినిమాల క‌న్నా ఎక్కువ‌గా చెప్పుకునేది… వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు ఆమెపై ఉండే అభిమానం గురించే. అప్ప‌ట్లో వ‌ర్మ సినిమా అన‌గానే హీరో, ఇత‌ర క్యారెక్ట‌ర్లు వేరేవాళ్లు ఉండేవారు గానీ… హీరోయిన్ మాత్రం ఊర్మిళే. త‌న సినిమాల్లో ఊర్మిళ‌కు వ‌రుస అవ‌కాశాలిచ్చాడు వ‌ర్మ‌. ఇప్పుడంటే సినిమాకో హీరోయిన్ ను ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నాడు కానీ… అప్ప‌ట్లో ఊర్మిళ… వ‌ర్మ ఆస్థాన‌నాయ‌కిగా ఉండేది.

1995లో వ‌ర్మ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన రంగీలాతో ఊర్మిళ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. వ‌ర్మ తీసిన గాయం, అంతం, స‌త్య‌, దౌడ్ లో ఊర్మిళ‌నే హీరోయిన్. అలా వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుస సినిమాల్లో చేసిన ఊర్మిళ త‌ర్వాతి కాలంలో రేసులో వెన‌క‌బ‌డిపోయింది. వ‌ర్మ కూడా ఆమెను ప‌క్క‌న‌పెట్టి త‌న సినిమాల్లోకి కొత్త హీరోయిన్ల‌ను తీసుకున్నాడు. క్ర‌మంగా ఊర్మిళ ఫేడ‌వుట‌యిపోయింది. ఆమె గురించిన వార్త‌లు కూడా పెద్దగా ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

ఈ క్ర‌మంలో రెండేళ్ల‌క్రితం 2016, మార్చి 3న కాశ్మీర్ కు చెందిన వ్యాపార‌వేత్త, మోడ‌ల్ మొహ్ సిన్ అక్త‌ర్ మీర్ ను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ల‌యిన రెండేళ్ల‌త‌ర్వాత, సినిమాల‌కు గుడ్ బై చెప్పిన పదేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తోంది ఊర్మిళ. ఇర్ఫాన్ ఖాన్ ప్ర‌ధాన‌పాత్ర‌లో రూపొందుతోన్న బ్లాక్ మెయిల్ చిత్రంలో బెవాఫా బ్యూటీ అనే ఐటెంసాంగ్ లో చానాళ్ల త‌ర్వాత ఊర్మిళ మెరిసింది. ఈ పాట‌ను చిత్ర‌బృందం సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసిన వెంట‌నే వ‌ర్మ స్పందించాడు. ఊర్మిళ సాంగ్ వీడియోను ట్విట్ట‌ర్ లో షేర్ చేసిన‌ వ‌ర్మ వావ్… రంగీలా భామ‌… ఇప్ప‌టికీ అంతే అందంగా ఉంది. ఫ‌రెవ‌ర్ గ్రీన్ ఊర్మిళ‌ను ఈ పాట‌లో చూశారా అంటూ ట్వీట్ చేశాడు..