Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ సినిమా సంగతులపైనే కాకుండా..అప్పుడప్పుడూ సమకాలీన సంఘటనలపై కూడా తన అభిప్రాయాలు సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఉంటాడు. అయితే ఆ అభిప్రాయాలు ఎప్పుడూ వ్యంగాస్త్రాల రూపంలోనే ఉంటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన. ఇవాంకా భద్రతా ఏర్పాట్లు, ఆమెకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబోయే విందు, ఆమె వస్త్రధారణ తదితర విషయాలపై అటు న్యూస్ చానళ్లు, వార్తాపత్రికలు, ఇటు సోషల్ మీడియలోనూ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వర్మ కూడా ఇవాంకా పర్యటనపై స్పందించాడు.
వారం రోజుల క్రితం ఇవాంకాను సన్నీలియోన్ తో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వర్మ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను, ఇవాంకాను పోల్చుతూ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ఇవాంకాకు నంది అవార్డులివ్వాలని కూడా సెటైర్ వేశాడు. ఇవాంకాకు తాను అందంగా ఉంటానన్న అహంకారం ఎక్కువని వర్మ వ్యాఖ్యానించారు. తాను అందంగా ఉన్నానని భావించే ఇవాంకా గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా సీఎం కేసీఆర్ అందాన్ని చూసి షాక్ అవ్వడం ఖాయమననాడు వర్మ. కేసీఆర్, ఇవాంక పక్కపక్కన కూర్చుంటే…ఇవాంకాను ఎవరూచూడరని తాను పందెం కాస్తానన్నాడు. అలాగే ఇవాంకాకు అంతర్జాతీయ అందెగత్తగా, మొత్తం కుటుంబం చూడదగ్గ ఉత్తమ అందెగత్తగా, ఉత్తమ ప్రపంచ సుందరి నాయకురాలిగా మూడు స్పెషల్ జ్యూరీ నంది అవార్డులు ఇవ్వాలంటూ వరుసగా పోస్టులు చేశాడు వర్మ.