Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తనకు సంబంధం ఉన్నా లేకున్నా అన్ని విషయాలపై వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటాడు. అందరికంటే విభిన్నంగా స్పందించే రామ్ గోపాల్ వర్మ తాజాగా శ్రీరెడ్డి విషయంలో కూడా అదే తరహాలో స్పందించాడు. ఆమద్య పవన్ కళ్యాణ్ కంటే శ్రీరెడ్డికే ముంబయిలో గుర్తింపు ఎక్కువగా ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ తాజాగా మరోసారి శ్రీరెడ్డిపై వ్యాఖ్యలు చేశాడు. శ్రీరెడ్డి చేసిన ఉద్యమం వల్ల ఆమెపై ఉన్న బ్యాన్‌ను ఎత్తివేయడం జరిగింది. దాంతో పాటు కాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా ఇండస్ట్రీకి సంబంధించిన మరియు బయట వారితో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఏర్పాటుకు ప్రధాన కారణం శ్రీరెడ్డి అని చెప్పుకోవచ్చు.
శ్రీరెడ్డి కారణంగా చాలా కాలంగా వాయిదాలు పడుతూ వచ్చిన కమిటీ వేయడంను వర్మ అభినందించాడు. వంద సంవత్సరాల సినీ పరిశ్రమ చరిత్రలో ఇలా ఎవరు పోరాడలేదని, శ్రీరెడ్డి పోరాటం ముందు తరాల వారికి ఉపయోగదాయకం అంటూ వర్మ అభినందించాడు. శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంకు నా సెల్యూట్ అంటూ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాస్టింగ్ కౌచ్ గురించి గతంలో ఎవరు వెలుగులోకి తీసుకు రానంతగా శ్రీరెడ్డి తీసుకు వచ్చిందని, అందుకే ఆమె వల్ల ఇతర ఆడవారు కాపాడబడ్డారు అంటూ తన అభిప్రాయంను వ్యక్తం చేశాడు. శ్రీరెడ్డి చేసిన పోరాటంకు ఆమె తల్లిదండ్రులు గర్వ పడాలని, ఆమె తమ కూతురు అయినందుకు వారు సంతోషించాలి అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. వర్మతో పాటు ఇంకా పలువురు సినీ ప్రముఖులు మరియు మహిళ సంఘాల వారు కూడా శ్రీరెడ్డికి మద్దతుగా నిలుస్తు, అభినందనలు తెలియజేస్తున్నారు.