డ్రగ్స్‌ ఇష్యూ : ఛార్మిలో వర్మకు ఆ యాంగిల్‌ కనిపించిందట

RGV-Sensational-Tweets-On-C

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్‌ డ్రగ్స్‌ ఇష్యూలో వర్మ కాస్త ఆలస్యం స్పందించి సిట్‌ అధికారుల తీరుపై విమర్శలు చేసిన విషయం తెల్సిందే. సినిమా వారు అయిన కారణంగానే విచారణ ఎక్కువ సమయం చేస్తున్నారని విద్యార్థులను మరియు ఇతరులను ఇంత సమయం చేస్తారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆ వ్యాఖ్యలపై సిట్‌ అధికారులు ప్రత్యేకంగా స్పందించి తమకు అందరు సమానమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఆ వివాదం కొనసాగుతుండగానే తాజాగా వర్మ మరోసారి వర్మ ఈ విషయమై సోషల్‌ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

వర్మ ఫేస్‌బుక్‌లో ఛార్మి డ్రగ్స్‌ విషయంలో విచారణకు హాజరు అవ్వడంపై స్పందిస్తూ.. ఛార్మి సిట్‌ ఆఫీస్‌లోకి వెళ్లే ముందు కంటే వచ్చేప్పుడు చాలా అందంగా ఉందని, ఆమెను చూస్తుం జాన్సీ లక్ష్మీభాయిని చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుందని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఛార్మినే రివర్స్‌లో సిట్‌ను విచారించినట్లుగా తనకు అనిపిస్తుందని పోస్ట్‌ చేశాడు. ఛార్మి విచారణ పూర్తి చేసుకున్న తర్వాత చాలా హుషారుగా, సంతోషంగా కనిపించింది. కొన్ని వీడియోల్లో ఆమె నవ్వుతూ అందరికి అభివాదం చేస్తూ అక్కడ నుండి వెళ్లినట్లుగా ఉంది. సిట్‌ కార్యయంలోకి వెళ్లే సమయంలో కూడా ఆమె మొహంపై చిరు నవ్వు చిందిస్తూ లోనికి వెళ్లింది. అందుకే వర్మ పై విధంగా పోస్ట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు:

అలా ఎప్పటికి చేయను : సాయి పల్లవి