నానా గురించి వర్మ షాకింగ్‌ వ్యాఖ్యలు…!

Ram Gopal Varma Shocking Comments On Nana Patekar

రామ్‌గోపాల్‌ వర్మ రంగంలోకి దిగాడంటే ఆ టాఫిక్‌ చాలా వాడీ వేడీగా జరుగుతుందని అర్థం. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి రచ్చ రచ్చ జరుగుతోంది. పలువురు సెలబ్రిటీలు తమపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని గురించి బహిరంగానే పోస్ట్‌లు పెడుతున్నారు. బాలీవుడ్‌ నటి తనూశ్రీ నానాపటేకర్‌పై లైంగిక ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను కొందరు సమర్థిస్తున్నారు మరికొందరు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజగా రామ్‌గోపాల్‌ వర్మ కూడా నానాపై వస్తున్న ఆరోపణలను ఖండిరచారు. నానా స్ట్రయిట్‌ ఫార్వాడ్‌ వ్యక్తి అని, ఆయన జీవితంలో ఎవరిని కూడా లైంగికంగా వేధించడు అంటూ చాలా గట్టిగా వాదిస్తున్నాడు.

nana-patekar

నానా షార్ట్‌ టెంపర్‌ వ్యక్తి, ఆయన్ను అర్థ చేసుకోకుండా అంతా తప్పుపడుతారు కానీ అర్థం చేసుకుంటే ఆయన గొప్ప వ్యక్తిత్వం అర్థమవుతుందని వర్మ చెప్పుకొచ్చాడు. తాను ముంబై వెళ్లి కొత్తలో నానాకు ఫోన్‌ చేస్తే హలో అనకుండా డైరెక్ట్‌గా బోల్‌ అన్నాడు, నేను హైద్రాబాద్‌ నుండి వచ్చాను, డైరెక్టర్‌ని అనగానే ఇంటికి పిలిచాడు, కథ చెబుతుంటే టీ తాగుతావా అని అడిగాడు, నేను ఒకే చెప్పగానే కిచెన్‌ చూపించి టీ చేయమన్నాడు, నాకు టీ చేయడం రాదని చెబితే ఇంత వయసొచ్చింది టీ చేయడం రాదా అంటూ గద్దించాడు, మీ అమ్మకు ఫోన్‌ కలుపు అంటూ అమ్మతో మాట్లాడాడు. ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న నానాపై తనూశ్రీ చేసిన లైంగిక ఆరోపణలను తాను నమ్మను అంటూ తనూశ్రీ పొరబడి ఉండొచ్చు, ఓ సారి ఆలోచిస్తే మంచిది అని వర్మ నానా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

nana