Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏమైనా చేయగలడు. తన ప్రతిభతో వర్మ ఎలాంటి అంశంతో అయినా వివాదంను సృష్టించగలడు. పబ్లిసిటీ కోసమో లేక మరేమో కాని వర్మ చేస్తున్న ప్రతి సినిమా కూడా వివాదం అవుతూనే ఉంది. తాజాగా వర్మ గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ అనే షార్ట్‌ఫిల్మ్‌ను తెరకెక్కించాడు. ఆ సినిమాపై వస్తున్న విమర్శల గురించి మాట్లాడేందుకు వర్మ టీవీ9 స్టూడియోకు వెళ్లాడు. అక్కడ యాంకర్ రజినీకాంత్‌తో ఈ విషయమై మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో తన ఫోన్లో ఏదో చూస్తూ వర్మ ఉన్నాడు. మామూలుగా అయితే లైవ్‌లో ఉన్న వారు ఫోన్లను పూర్తిగా పక్కకు పెడతారు. కాని వర్మ మాత్రం ఎప్పుడు స్టూడియోలో ఉన్నా కూడా ఫోన్లో ఏదో ఒకటి చూస్తూనే ఉంటాడు.
ఈసారి మాత్రం వర్మ డిబెట్ జరుగుతుండగా పోర్న్ చూశాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఫొటో తెగ సర్కులేట్ అవుతుంది. వర్మ ఫోన్లో పోర్న్ చూస్తూ దొరికి పోయాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వర్మపై ఇప్పటికే వివాదాలు భారీ ఎత్తున వస్తున్నాయి. ఇలాంటి సమయంలో వర్మ పోర్న్ చూస్తు పట్టుబడటంతో మరింతగా రచ్చ మొదలైంది. అయితే వర్మ ఫోన్లో చూస్తున్నది పోర్న్ అని ఎలా చెప్పగలరు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా వర్మ పలు ఇంటర్వ్యూల సందర్బంగా ఫోన్లో చాట్ చేయడం, ఫోన్‌ను చూడటం చేశారు. ఇప్పుడు మాత్రం పోర్న్ గురించి మాట్లాడుతున్నారు కనుక పోర్న్ చూస్తున్నాడు అంటూ కన్ఫర్మ్ చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు ఎక్కువ మంది వద్ద సమాధానం లేదు. ఒక టీవీ స్టూడియోలో వర్మ పోర్న్ చూడక పోవచ్చు అంటూ ఆయన అభిమానులు మరియు ఇతరులు కూడా అంటున్నారు.