నాలుగున్నరేళ్ల క్రితం నమో భజన చేసిన నేతలంతా ఈ రోజున మోడీ దిగిపో అని నినదిస్తున్నారు. మోడీయే కావాలి ఆయానోస్తేనే దేశం ముందుకు పోతుంది అని నినదించిన వాళ్లంతా ఇప్పుడు మోడీ ప్రభుత్వం గద్దె దిగితేనే దేశానికి భవిష్యత్తు ఉంటుంది అని భావించి తమ గళం విప్పుతున్నారు. ఆంధ్రాకు ఇచ్చిన మాటలే కాదు దేశానికి దేశ ప్రజలకు ఇచ్చిన మాటలను , హామీలను తుంగలో తొక్కడంతో చేయడంతో రగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని ఏర్పాటు చేస్తున్న మోడీ వ్యతిరేక కూటమికి జై కొడుతున్నారు. 36 ఏళ్ల శత్రుత్వాన్ని కూడా పక్కన పెట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు సిద్ధమై చంద్రబాబు చూపించున దారి ఇప్పుడు దేశంలోని మోడీ వ్యతిరేక, మోడీని గద్దె దించాలి అనుకునే శక్తులకు దిశానిర్దేశం అయ్యింది. చంద్రబాబు చూపిన బాటలోనే నడిచేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ పదం కలిపి ముందుకు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో మోడీని గెలిపించేందుకు పని చేసి, నిన్న మొన్నటి వరకు మోడీతో దగ్గరి సంబంధాలు నెరిపిన రాందేవ్ బ్బబా కూడా చంద్రబాబు కూటమిలో చేరేందుకు ఉవ్విళ్ళుతున్నట్లు తెలుస్తోంది. గురువారం అమరావతి వచ్చిన యోగా గురు రాందేవ్ బాబా ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. విజయనగరం జిల్లా చిన్నరావుపల్లిలో పతంజలి సంస్థ ఏర్పాటు చేసే ‘మెగా ఫుడ్ పార్క్’పై సీఎంతో ఆయన చర్చించారు. మెగాఫుడ్ పార్క్ గురించి చంద్రబాబుకు రాందేవ్ వివరించారు. రూ.634 కోట్ల వ్యయంతో ఆహారశుద్ధితో పాటు అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేస్తామని సీఎంకు తెలిపారు. ఈ పార్క్‌తో 33,400 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం 172.84 ఎకరాల భూమిని పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థకు కేటాయించింది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడి లేని వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రసాయనాలు, పురుగు మందులు లేని వ్యవసాయ ఉత్పత్తుల దిశగా కృషి చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. అయితే పైకి ఇది పక్కా వ్యాపార సబంధమైన భేటీ మాదిరి కనిపిస్తున్నా ఈ భేటీ వెనుక రాజకీయ కోణం వేరే ఉందని చెబుతున్నారు. మరో వారం రోజుల్లో అంటే అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరునాడు ఢిల్లీలో మోడీ వ్యతిరేక కూటమి సమావేశం జరగబోతుంది. ఈ పనిలో చంద్రబాబు బిజీగా వున్నారు. ఏ రకంగానైనా మోడీతో, బీజేపీతో విభేదించే అన్ని రకాల శక్తులను కలిపేందుకు చంద్రబాబు భారీ ప్రాణాళికతోనే వ్యూహాలు రచిస్తున్నారు. అలాంటి తరుణంలో చంద్రబాబుతో రాందేవ్ బాబా భేటీ కావడం చర్చకు దారి తీస్తోంది. వారిద్దరి భేటీలో ఏమి మాట్లాడుకున్నారో బయటకు రాకున్నా కచ్చితంగా రాజకీయ చర్చలు జరిగే వుంటాయని ఢిల్లీలో జరిగే మోడీ వ్యతిరేక కూటమి సమావేశానికి రాందేవ్ మద్దతు ఇచ్చి ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే మోడీ నుంచి మరో మిత్రుడు దూరమైనట్లే.