Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కత్తి మహేష్ గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్‌పై చేస్తున్న విమర్శలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఆయన పవన్‌పై చేస్తున్న వ్యాఖ్యలకు అదే స్థాయిలో సినిమా పరిశ్రమ నుండి మరియు పవన్ అభిమానుల నుండి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా కత్తి మహేష్‌పై ఎదురు దాడికి నిర్మాత రాంకీ ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. కత్తి మహేష్ గురించి తన వద్ద కొన్ని సంచలన విషయాలు ఉన్నాయని, ఆయనో ఉమనైజర్ అంటూ రాంకీ చెప్పుకొచ్చాడు. ఆ విషయమై తాజాగా టీవీ9లో చర్చ జరిగింది. ఆ సమయంలోనే రాంకీ మాట్లాడుతూ ఒక అమ్మాయికి అసభ్యంగా కత్తి మహేష్ మెసేజ్‌లు చేశాడు. ఆ అమ్మాయి స్వయంగా తనకు ఆ మెసేజ్‌లు ఫార్వర్డ్ చేసింది అంటూ రాంకీ చెప్పుకొచ్చాడు.
ఆ విషయమై కత్తి మహేష్ స్పందిస్తూ… ఒక సినిమా కోసం తెలుగు అమ్మాయి హీరోయిన్‌గా కావాలని ఆడిషన్స్ చేయడం జరిగింది. అందులో చాలా మంది అమ్మాయిలు బాగున్నారు. వారిలో కొందరికి నేను మెసేజ్‌లు చేశాను. ఐలవ్ యు, ఐ లైక్ యు, ఐవాట్ యూ అంటూ నేను మెసేజ్‌లు చేశాను అంటూ కత్తి మహేష్ స్టూడియోలో బాహాటంగా ఒప్పుకున్నాడు. ఒక అమ్మాయి నచ్చినట్లయితే ఆమెకు ఆ విషయం చెప్పి, ఆమెకు నచ్చితే ఓకే లేదంటే వదిలేసే రకం తాను అని, ఒక అమ్మాయి కోసం వెంటపడి, ఆమెను వేదించేరకం తాను కాదు అంటూ కత్తి మహేష్ చెప్పుకొచ్చాడు. తాను చేసేది కాస్టింగ్ కౌచ్ కాదని, తాను చేసినదాంట్లో తప్పేం లేదు అంటూ కత్తి మహేష్ సమర్ధించుకోవడం ఇక్కడ చర్చనీయాంశం. మొత్తానికి కత్తి మహేష్ కాస్త సందిగ్దంలో పడ్డట్లుగా తెలుస్తోంది.