Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Rana Daggubati Relation Ship With Kajal Aggarwal
టాలీవుడ్‌లో రానాకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. రానా హీరోయిన్స్ చాలా సులభంగా ఆకర్షిస్తాడని, వారిని వాడేసుకుంటాడని, రానాను హీరోయిన్స్ కూడా ఎంతో ఇష్టపడతారు అని అంటారు. ఆ విషయం మరోసారి నిజమేనేమో అనిపిస్తుంది. తాజాగా రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో నటించాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటించింది. సినిమా సమయంలో వీరిద్దరి మద్య సన్నిహిత సంబంధం ఏర్పడ్డట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
షూటింగ్ సమయంలో వీరిద్దరు చాలా అన్యోన్యంగా కనిపించేవారని, ఇద్దరు ప్రతి విషయంలో కూడా కలిసి నిర్ణయం తీసుకోవడం, ఏదైనా సీన్ ఉంటే పలు సార్లు సొంతంగా ప్రాక్టీస్ చేయడం చేసేవారని చెబుతున్నారు. తాజాగా షూటింగ్ పూర్తి అయ్యింది. షూటింగ్ లేనప్పుడు కూడా ఇద్దరు పలు సార్లు కలుస్తున్నారట. వీరిద్దరి వ్యవహారం కాస్త తేడాగా ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. రానా గతంలో త్రిషతో ప్రేమలో పడ్డ విషయం అందరికి తెల్సిందే. మరి ఇప్పుడు కాజల్‌తో మనోడు లవ్ ఆట ఆడుతున్నాడేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.