పవన్‌ ఆస్కార్‌ వ్యాఖ్యలపై విమర్శలు

Rangasthalam deserves an Oscar says Pawan kalyan

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పవన్‌ ఏం మాట్లాడినా కూడా అర్థం, పరమార్థం ఉంటుందని అంతా భావిస్తారు. కాని తాజాగా తన అన్న కొడుకు చరణ్‌ సినిమా ‘రంగస్థలం’ విజయోత్సవ వేడుకలో పవన్‌ మాట్లాడిన మాటలు విమర్శలకు తావిస్తున్నాయి. రామ్‌ చరణ్‌ ‘రంగస్థలం’ చిత్రం సూపర్‌ హిట్‌ అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో ‘రంగస్థలం’ యూనిట్‌ సభ్యులు సక్సెస్‌ మీట్‌ను యూసుఫ్‌ గూడా పోలీస్‌ లైన్స్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో చీఫ్‌ గెస్ట్‌గా హాజరు అయిన పవన్‌ కళ్యాణ్‌ షాకింగ్‌ వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

‘రంగస్థలం’ చిత్రంలో రామ్‌ చరణ్‌ నటన బాగుందనే విషయం అందరికి తెల్సిందే. అయితే ఆస్కార్‌ లెవల్‌లో ఉందని మాత్రం అనుకోవడం కాస్త అతి అవుతుంది. మరి రామ్‌ చరణ్‌పై అభిమానమో లేక మరేమో కాని పవన్‌ ఏకంగా చరణ్‌ నటన ఆస్కార్‌ లెవల్‌లో ఉందని, రంగస్థలం చిత్రంను ఆకాశానికి ఎత్తేసి చరణ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. చరణ్‌ నటన జాతీయ స్థాయి అవార్డుకు అర్హం అంటే పర్వాలేదు, కాని ఏకంగా ఆస్కార్‌ అవార్డు అంటూ చెప్పడం కాస్త అతిశయోక్తిని కలిగించేదిగా ఉందని అంటున్నారు.