చిరు, సుక్కు, రవితేజ త్వరలో..!

chiranjeevi-and-ravi-tejas-multi-starrer-movie-directed-sukumar

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘రంగస్థలం’ చిత్రంతో మరోసారి తన సత్తాను చాటిన దర్శకుడు సుకుమార్‌తో సినిమాలు చేసేందుకు స్టార్‌ హీరోలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్‌ తన తర్వాత సినిమాను మహేష్‌బాబుతో చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. అందుకు సంబంధించిన ప్రకటన వారం పది రోజుల్లో వెలువడే అవకాశాలున్నాయి. మహేష్‌బాబు 26వ చిత్రంగా సుకుమార్‌ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతుందని సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మహేష్‌ 26వ చిత్రం ఈ సంవత్సరం చివర్లో ప్రారంభం అయ్యి, వచ్చే ఏడాదిలో విడుదల అయ్యే అవకాశం ఉంది. మహేష్‌ 26వ చిత్రం తర్వాత సుకుమార్‌ తన తదుపరి చిత్రాన్ని చిరంజీవితో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

భారీ అంచనాల నడుమ, పూర్తి పల్లెటూరు నేపథ్యంలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం సూపర్‌ హిట్‌ అయిన కారణంగా చిరంజీవి స్వయంగా సుకుమార్‌తో సినిమా చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే సుకుమార్‌ స్క్రిప్ట్‌ను సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. చిరంజీవికి వినిపించిన కథానుసారంగా ఈ చిత్రంలో మరో హీరో కూడా కనిపించబోతున్నాడు. ఆ పాత్రకు రవితేజను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారు. చిరంజీవితో నటించేందుకు రవితేజ ఎప్పుడు కూడా సిద్దంగానే ఉంటాడు. అందుకే వచ్చే సంవత్సరం చిరంజీవి, రవితేజల మల్టీస్టారర్‌ చిత్రం సుకుమార్‌ దర్శకత్వంలో రావచ్చు అని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక ప్రస్తుతం చిరంజీవి తన 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.